Thalapathy Vijay: సినీ ఇండస్ట్రీలోకి వారసులు వస్తుండడం సర్వ సాధారణం.. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల వారసులు ఫిలీం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సక్సెస్ సాధించిన వారున్నారు.. ఫెయిల్యూర్ అయిన వారున్నారు. ఈ క్రమంలోనే మరో వారసుడు కూడా తమిళ సినీ ఇండస్ట్రీలోకి ఎంటర్ కాబోతున్నారు.
Read Also: Ekta Kapoor: అన్ని డబ్బులున్నాయి ఏం చేసుకుంటావ్.. మంచి బట్టలు కొనుక్కో
తమిళ నాట దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రజనీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న యాక్టర్ విజయ్ మాత్రమే. అతడికి తెలుగులోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నారు. విజయ్ దళపతి వారసుడిగా తన కుమారుడు జాన్సన్ సంజయ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక సంజయ్ హీరోగా తెరపై కాకుండా దర్శకుడిగా తెర వెనక ఉండి సినిమాని నడిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తన మనవడు సంజయ్ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు.
Read Also: Jalebi Baba : దెబ్బకి దెయ్యం వదిలిందిగా.. 120మందిపై అత్యాచారం
సంజయ్ కు డైరెక్షన్ అంటే ఎంతో ఇష్టం అందుకే సంజయ్ విదేశాలలో డైరెక్షన్ కి సంబంధించిన కోర్స్ చేస్తున్నారని ఇది పూర్తికాగానే దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారని తెలిపారు. ఇక సంజయ్ దర్శకుడిగా మారిన తర్వాత ఆయన తను మొదటి చిత్రాన్ని నటుడు విజయ్ సేతుపతితో చేయబోతున్నారని ఈ సినిమా అనంతరం తన తండ్రి విజయ దళపతితో సినిమా చేయబోతున్నట్లు సంజయ్ తాత విజయ్ తండ్రి వెల్లడించారు.