Ekta Kapoor: ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిత్యం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తన సీరియల్స్, వ్యక్తిగత జీవితం విషయంలో ఆమె ట్రోల్స్ కు గురవుతూనే ఉంటారు. ఇటీవల ఏక్తా కపూర్ నటి రిధి డోగ్రా ఇంటికి వెళ్లారు. కొత్త ప్రాజెక్ట్ విషయమై అభినందించేందుకు వెళ్లిన ఏక్తా తను వేసుకున్న దుస్తులపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో కారులో నుంచి దిగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె కారునుంచి దిగడం చూడవచ్చు.. ఏక్తా వదులుగా ఉన్న నలుపు గౌను ధరించింది. అయితే ఆమె వేసుకున్న డ్రస్ జనాలకు పెద్దగా నచ్చలేదు. ఏక్తా స్వయంగా ఆ డ్రెస్‌లో చాలా అసౌకర్యంగా కనిపించింది.
Read Also: Jalebi Baba : దెబ్బకి దెయ్యం వదిలిందిగా.. 120మందిపై అత్యాచారం
ఆమె దుస్తులపై యూజర్లు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. . ‘ఇట్నే పైసే కా క్యా హై ఫైదా జబ్ ఆప్కో కప్డే పెహ్నే కి తమీజ్ నా హో’ అని రాసారు, మరొకరు ‘యే WWF కి కొత్త రెజ్లర్ హై’ అని రాశారు. ఆమె ఇటీవల బాగా బరువు పెరిగారు. ‘మంచి బట్టలు కొనుక్కోలేని అక్కా, కనీసం మంచి బట్టలు కూడా వేసుకోలేని వీళ్లు ఇంత సంపాదించి ఏం చేస్తారు’ అని మరొకరు కామెంట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు కూడా సుశాంత్ పేరు మీద అతనికి బట్టలు విరాళంగా ఇస్తామని రాశారు. ఏక్తాపై గతంలోనూ నెటిజన్లు గుస్సుగానే ఉన్నారు. ఆమె తన సినిమాలతో యువత మనసులను కల్మషం చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. ‘గాండీ బాత్’, ‘XXX’, ‘రాగిణి MMS 2’ ఆమె తీసిన సినిమాలు.. ఇవన్నీ బోల్డ్ కంటెంట్ ఫుల్ గా ఉన్న సినిమాలు. ఈ విషయంలోనూ సుప్రీంకోర్టు గతంలో ఏక్తా కపూరును మందలించింది కూడా.