విజయ్ దేవరకొండ గురించి తెలియని వాళ్లు ఉండరు.. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. అర్జున్ రెడ్డి తో సాలిడ్ హిట్ ను అందుకున్న హీరో, ఆ తర్వాత వచ్చిన సినిమాలల్లో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి.. గత ఏడాది వచ్చిన ఖుషి సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. గీతాగోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ సినిమాను చేస్తున్నాడు.. ఈ సినిమా ఏప్రిల్ 5 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన పోస్టర్స్, సాంగ్స్ నిన్న విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను అలరించడం తో సినిమా పై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో విజయ్ దేవరకొండ వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తన లవ్, బ్రేకప్ గురించి ఎన్నో విషయాలను చెప్పుకువచ్చారు.. ఆ విషయాలను విన్న చాలా మంది నమ్మలేకపోయారు కూడా..
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. విజయ్ లవ్ స్టోరీ గురించి చెప్పడం విశేషం.. ఒకరితో ప్రేమలో ఉన్నప్పుడు వేరే అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించనని తెలిపాడు. ప్రేమించిన అమ్మాయినే అన్ని తానే భావిస్తానని చెప్పుకువచ్చాడు.. గతంలో తన జీవితంలో రెండు బ్రేకప్ లు అయ్యాయని చెప్పాడు.. విజయ్ బ్రేకప్ గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. ఫ్యామిలీ స్టార్ సినిమా తర్వాత మరో రెండు సినిమాల్లో నటిస్తున్నారని సమాచారం..