ప్రెసిడెంట్ తో సహా మరో నలుగురు జైలుపాలయ్యారు…!! తీగ లాగితే డొంక కదిలి… అందరి బాగోతం బయటపడుతోంది..!! వందల కోట్ల అవినీతి చూసి జనాలు ఛీ కొడుతున్నారు..!! అయినా HCA తీరు మారడం లేదు. నెక్ట్స్ నేనే ప్రెసిడెంట్… నువ్వు సెక్రెటరీ… అని కొందరంటే… నీ బాగోతం కూడా బయటపెడతా… నేనే ప్రెసిడెంట్ అంటున్నాడట మరో పెద్దాయన !! అవినీతి మరకను కడిగిపారేసి.. ఇప్పటికైనా హెచ్‌సీఏలో ప్రక్షాళన చేపట్టాల్సిందిపోయి.. అవినీతి తిమింగలాల వారసులు పుట్టుకొస్తున్నారట !! హైదరాబాద్…
HCA : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు జగన్మోహన్‌రావుపై మల్కాజ్‌గిరి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కేసులో కీలకమైన రిమాండ్ రిపోర్ట్ ఎన్టీవీ చేతికి చేరింది. ఈ రిపోర్ట్‌లో చోటుచేసుకున్న నకిలీ పత్రాలు, ఫోర్జరీలు, నిధుల దుర్వినియోగం, పత్రాలపై సంతకాల ఫోర్జరీ లాంటి అంశాలు హచ్ఛగా వెలుగులోకి వచ్చాయి. రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మే 2024 కంటే ముందే జరిగిన ఘటనల నేపథ్యంలో, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి…
హెచ్‌సీఏ అక్రమాలపై సంచలన విషయాలు బయటపడ్డాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తయింది. ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిగింది. హెచ్‌సీఏ సెక్రటరీ ఎస్‌ఆర్‌హెచ్ ఫ్రాంచేజ్ పై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు నిర్ధారణ అయింది.
భారత్-పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై భారత దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పోర్ట్స్ సెంట్రల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలు తిరిగి ప్రారంభించాలంటే సరిహద్దుల్లో శాంతి నెలకొనాలని చెప్పారు.