తిరుపతిలో చిన్నపిల్లల అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కిషోర్, సాయి శ్రీనివాస్, మునికుమార్ అనే ముగ్గురు యువకులను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
ఎస్పీ వెంకట అప్పలనాయుడు మాట్లాడుతూ.. చిన్నపిల్లల అశ్లీల వీడియోలను డౌన్ లోడ్ చేసి, ఇతరులకు వీరు షేర్ చేసినట్టు గుర్తించాము. 31 అసభ్యకర వీడియోలను నిందితులు అప్ లోడ్ చేసారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నాము. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. అసభ్యకర వీడియోలను అప్ లోడ్ చేసి డిలీట్ చేసినా, గుర్తిస్తాము. మహిళలు, పిల్లల విషయంలో క్రైం జరిగితే ఉపేక్షించేది లేదు. ఎవరైనా బాధితులు ఉంటే ఫిర్యాదు చేయండి. వివరాలు గోప్యంగా ఉంచి విచారణ జరుపుతామని ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు.