వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. "వైసీపీ పెట్టిన అక్రమ కేసుల్ని నిర్ణీత కాలపరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నాం.
వన్ నేషన్-వన్ ఎలక్షన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మద్దతు తెలిపారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
Bhatti Vikramarka: ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్నటువంటి వంటి పథకాలు లేవు అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శాసన సభను కూడా వాళ్ళ అబద్ధాలను నిజాం చేసుకునేందుకు వాడుకుంటున్నారని ఆరోపించారు. స్పీకర్ కూడా వారికి రూల్స్ తెలియజేసే ప్రయత్నం చేయడం లేదన్నారు.
Harish Rao : మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా.. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని, తెలంగాణలో మహిళలకు ₹ 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్ర లో ₹3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది…
దేశంలో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. జమ్మూకాశ్మీర్, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఆయా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ మహిళలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ వరాల జల్లు కురిపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని రాహుల్ ప్రకటించారు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో టీఆర్ఎస్.. కాంగ్రెస్ నేతలను కష్టాలకు గురిచేసిందని ఆరోపించారు. టీఆర్ఎస్ దళిత ముఖ్యమంత్రి అన్నారు చేయలేదని విమర్శించారు. మరోవైపు.. కిషన్ రెడ్డి ఆరు గ్యారెంటీస్ అమలు చేయరు అని అంటున్నారు.. కర్ణాటక వెళ్లి చూడాలని తెలిపారు. కొందరు ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదు అని మాట్లాడుతున్నారు.. కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు.. ఏమైందని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.
రచ్చబండ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతి హామీని 2023లో అధికారం లోకి రాగానే నెరవేరుస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పపూర్లో రచ్చబండ కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ నేతలు అది శ్రీనివాస్ తదితరులతో కలసి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్ర అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకే రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రచ్చబండ…