కేసీఆర్ సర్కార్‌ను తెలంగాణ ప్రజలు మార్చాలని అనుకుంటున్నారని అన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ తెలంగాణ నయా నిజాం అంటూ వ్యాఖ్యానించారు. ఆయనకు అహంకారం ఎక్కువ అని, ఆయనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ఏమీ పట్టవు… అయన కుటుంబం వీటన్నిటికీ అతీతం అని అనుకుంటాడని ఆయన అన్నారు. అయన రాజ్యాంగాన్ని అవమానిస్తారని, ఇది అత్యాచారాల ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇది తెలంగాణ భవిష్యత్ కోసం పోరాటమని తరుణ్ చుగ్ అన్నారు.
Also Read : MLA Ramesh Babu : చవట దద్దమ్మలార రమేష్ బాబు బెదరడు.. పుట్టుడే ఎమ్మెల్యే కొడుకుగా పుట్టిన
విపక్షాల కూటమి కోసం అయన ప్రయత్నాలు విఫలం అవుతున్నాయని, తన రిటైర్ మెంట్ కేసీఆర్‌కి తెలుసునని తరుణ్‌చుగ్ అన్నారు. నవంబర్‌లో అయన రిటైర్ కాబోతున్నారని, కేంద్రంలో బలహీన సర్కార్ రావాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేవరకు పోరాటం చేస్తామని, నిరుద్యోగులకు లక్ష రూపాయల ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంలో నిరుద్యోగుల పక్షాన ఆందోళలు కొనసాగిస్తామని తరుణ్ చుగ్ స్పష్టం చేశారు.
Also Read : 90 Minutes In 22 Shots : 90 నిమిషాల్లో 22 పెగ్ లు.. అంతలోనే..