Varun Tej : మెగా హీరో వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ముకుంద సినిమాతో హీరోగా పరిచయం అయిన వరుణ్ తేజ్ ఆ తరువాత వచ్చిన కంచె సినిమాలో తన నటనతో అందరిని ఎంతగానో మెప్పించాడు.ఆ తరువాత వరుస సినిమా లు చేసిన వరుణ్ తేజ్ సక్సెస్ లతో పాటు ఫెయిల్యూర్స్ కూడా చూసాడు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.వరుణ్ తేజ్ గత ఏడాది గాంధీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఆ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.అలాగే ఈ ఏడాది ఆపరేషన్ వాలంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా కూడా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.దీనితో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఎంతో జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుంటున్నాడు.వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “మట్కా”.. ఈ సినిమా ను “పలాస 1978 ” మూవీ ఫేమ్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
Read Also :Indian 2 : ఇండియన్ 2 పోస్ట్ పోన్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రజని తాళ్లూరి , తీగల కృపాకర రెడ్డి ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ,నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే నవీన్ చంద్ర,అజయ్ ఘోష్ ఈ సినిమాలో కీలక పాత్రలలో నటిస్తున్నారు.యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ మరో దర్శకుడితో సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.వేంకటాద్రి ఎక్స్ప్రెస్ ,ఎక్స్ ప్రెస్ రాజా ,కృష్ణార్జున యుద్ధం సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన మేర్లపాక గాంధీ వరుణ్ తేజ్ కు క్రైమ్ కామెడీ జోనర్ లో ఓ స్టోరీ వినిపించగా ఆ స్టోరీ నచ్చడంతో వరుణ్ తేజ్ ఆ దర్శకుడితో సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం.అలాగే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నట్లు సమాచారం.