తెలంగాణా మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే.. అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకు నచ్చినట్లు చేస్తాడు.. ఎవ్వరికి భయపడడు.. ఎక్కడా తగ్గడు.. సినీ ఈవెంట్స్ లో ఆయన స్పీచ్ వింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. అలాంటి మల్లన్న తాజాగా గోవాలో చిల్ అవుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
అప్పుడు మంత్రిగా ఉన్నా, ఇప్పుడు ఎమ్మెల్యే గా ఉన్న కూడా ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.. ఆయనే.. మల్లారెడ్డి.. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. సోషల్ మీడియా ఫాలోయింగ్ తగ్గట్టుగానే ఆయన కూడా కంటెంట్ ఇస్తూనే ఉంటారు. తాజాగా ఎలక్షన్స్ తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఎమ్మెల్యే మల్లన్న గోవాకు వెళ్లారు.. కొంతమంది నేతలతో గోవాలో ఎంజాయ్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు.. సముద్రంలో పారా స్లైడింగ్ చేస్తూ హుషారుగా కనిపించారు. అంతటితో ఆగకుండా.. అక్కడే బోటు నడిపి తెలుగు వాళ్ళతో జై మల్లన్న అనిపించుకున్నాడు.. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇక తెలంగాణా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాస్త రిలాక్స్ అవ్వడానికి దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తుంది.. అక్కడ బీచ్ లో దిగిన ఫోటోలు, అక్వేరియం దగ్గర దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. మాజీ మంత్రులు ఇలా వేకేషన్ ను ఎంజాయ్ చెయ్యడం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ కూడా నడుస్తుందని తెలుస్తుంది..