వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీకి ఫిర్యాదు చేసింది తెలుగుదేశం పార్టీ.. దీనిపై మీడియాతో మాట్లాడిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య.. మేం ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నట్టు ఏసీబీ ఎస్పీ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారని తెలిపారు.. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించాల్సిందే అని హెచ్చరించారు.
మచిలీపట్నం వైకాపా ఎమ్మెల్యే పేర్ని నాని ఎన్నికల సంఘంపై అర్ధంపర్ధం లేని విమర్శలు చేస్తున్నాడంటూ టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు సీఈసీ లేఖ రాశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. గతేడాది జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల అక్రమాలపై సీఈసీకి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.
సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ తన పార్టీని ఒక ‘ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’గా నడుపుతున్నాడని విమర్శించారు. జగన్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో వ్యవహరిస్తున్న తీరు ప్రైవేటు కంపెనీని నడుపుతున్నట్లుగా ఉందని ఆరోపించారు. మళ్లీ జగన్ అధికారంలోకి రావడానికి ప్రజలు ససేమిరా ఇష్టపడడం లేదని అన్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు, జగన్నే బదిలీ చేయాలని వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు. 12 మంది దళిత శాసన…
ఏపీ డీజీపీపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. డీజీపీ రాజేంద్రనాథరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజేంద్రనాథరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనా..? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు.. రాజేంద్రనాథరెడ్డి అపాయింట్ మెంట్ కోరితే ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదని అన్నారు.…
Jagannaku Chebudam: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభించారు.. ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ప్రతి వినతి పరిష్కారమయ్యే వరకూ ట్రాకింగ్ చేస్తామని.. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను పొందడంలో ఎలాంటి సమస్యలున్నా తెలియచేయవచ్చు అని పేర్కొన్నారు.. సంక్షేమ పథకాలు, వైయస్ఆర్ పెన్షన్ కానుక, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు పొందడంలో ఏమైనా అవాంతరాలు ఎదురైతే రైతన్నలు, అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, మరెవరైనా సరే 1902కు…
YSRCP Vs TDP: ఎన్టీఆర్ శతజయంతి వేడుక వేదికగా సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.. అయితే, వైసీపీ కామెంట్లకు టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.. తాజాగా, మంత్రులు, వైసీపీ నేతల వ్యాఖ్యలపై మండిపడ్డ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏపీకి వచ్చి మాట్లాడారు.. ఇక్కడ రజనీకాంత్ పై వైసీపీ నేతలు చేసిన కామెంట్లు తమిళనాడు వెళ్లి చేయగలరా..? అని…