Vangalapudi Anitha: విజయసాయిరెడ్డి కలలోకి గొడ్డలి వచ్చినట్లుంది.. హోంమంత్రి సెటైర్లు
- విజయసాయిరెడ్డి రాజీనామాపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత
- విజయసాయిరెడ్డి కలలోకి గొడ్డలి వచ్చినట్లుంది- వంగలపూడి అనిత
- అందుకే విజయసాయిరెడ్డి భయపడి రాజీనామా చేసి ఉండొచ్చు
- రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా తప్పు చేసినవాడు శిక్ష అనుభవించాలి- అనిత
- విజయసాయి రెడ్డికి తత్వం బోధపడింది- శ్రీనివాస్ రెడ్డి
- విజయసాయి వ్యవసాయం చేస్తే పచ్చని ప్రకృతి కూడా కలుషితం అవుతుంది- శ్రీనివాస్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయసాయిరెడ్డి రాజీనామాపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. విజయసాయి రెడ్డికి కలలోకి గొడ్డలి వచ్చిందేమో, అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చని హోంమంత్రి సెటైర్లు వేశారు. గత ఐదేళ్లలో దావోస్‌లో 4 సార్లు సమ్మిట్ జరిగితే ఒక్కసారి వెళ్ళొచ్చారని వంగలపూడి అనిత ఆరోపించారు. తిరనాళ్ళలో తప్పిపోయిన పిల్లాడి లాగా బిత్తర చూపులు చూస్తూ.. ఇట్స్ లెంగ్త్ క్వషన్ అన్నారని పేర్కొన్నారు. మానసికంగా క్షోభ అనుభవిస్తున్న పిల్లలపై కూడా ప్రతిపక్షం రాజకీయం చేయడం తగదన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని తాము అమలు చేస్తే.. వైసీపీ వాళ్ళు ఈ 7 నెలలలో రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండేది కాదని హోంమంత్రి అనిత తెలిపారు.
Read Also: Vijayawada: రిపబ్లిక్ డే వేడుకలకు సిద్ధమైన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం..
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్‌పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్‌కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. విజయసాయి రెడ్డికి తత్వం బోధపడిందని ఆరోపించారు. విజయసాయి రెడ్డికి ఆయన చేసిన పాపాలు కలలో కూడా గుర్తు వస్తూ ఉన్నట్లు ఉన్నాయి.. ఆయన వ్యవసాయం చేస్తే పచ్చని ప్రకృతి కూడా కలుషితం అవుతుందని విమర్శించారు. విశాఖ నగరాన్ని నాశనం చేసిన వ్యక్తి విజయ సాయి రెడ్డి.. చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన కుటుంబాన్ని దూషించిన వ్యక్తి విజయసాయిరెడ్డి అని దుయ్యబట్టారు. ఆ తప్పుల నుంచి తప్పించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు.. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
Read Also: భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులో కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. ఎలా దొరికాయంటే ?
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!