Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ian Bishop on Sanju Samson Form: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం రాత్రి ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 209 పరుగులకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ మరోసారి తక్కువ స్కోరుకే వెనుదిరగడం చర్చనీయాంశమైంది. ఈ మ్యాచ్‌లో సంజు ఆరు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. కీలక మ్యాచ్‌లో త్వరగా పెవిలియన్ చేరడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు.
సంజు శాంసన్ ప్రదర్శనపై కామెంటరీ బాక్స్‌లో ఉన్న వెస్టిండీస్ మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఇయాన్ బిషప్ స్పందించాడు. అతడి నిలకడలేమి భారత జట్టుకు ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించాడు. ‘సంజు మరోసారి తక్కువ స్కోరుకే ఔటవడం నాకు ఆశ్చర్యం కలిగించలేదు. 2026 టీ20 ప్రపంచ కప్ తర్వాత అతడు పదిలోపు పరుగులకే ఎన్నోసార్లు ఔటయ్యాడు. వరుసగా ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వడం భారత జట్టుకు ఆందోళన కలిగించే విషయమే. సంజు మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగల సామర్థ్యం ఉన్న ఆటగాడు. అయితే ప్రతిభతో పాటు నిలకడ కూడా చాలా ముఖ్యం. అభిమానులు అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నారు. కానీ మరోసారి త్వరగా ఔటవడంతో వారు నిరాశ చెందారు’ అని ఇయాన్ బిషప్ చెప్పుకొచ్చాడు.
Also Read
- Ind Vs NZ: సెంచరీతో కదం తొక్కిన కాటేరమ్మ కొడుకు.. పలు ప్రపంచ రికార్డులు బద్దలు..
- CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి సీనియర్ ఆటగాళ్ల పునరాగమనం..!
- Ind Vs NZ: కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన అభిషేక్ శర్మ.. ఊచకోత..
- Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
సంజు శాంసన్ గత 11 ఇన్నింగ్స్‌లలో 1(2), 27(15), 10(7), 57(22), 50(35), 9(7), 7(9), 2(4), 11(9), 82(41), 3(6) స్కోర్లు చేశాడు. ఇప్పుడు జట్టులో వైభవ్ సూర్యవంశీ లాంటి యువ ఓపెనర్ ఉన్నాడు. కాబట్టి సంజు తన ఆటలో నిలకడ తప్పనిసరి. సంజుకు భారీ షాట్లు ఆడే సామర్థ్యం, మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల ప్రతిభ ఉన్నాయి. అయితే వరుసగా తక్కువ స్కోర్లకే ఔటవుతుండటంతో అతడి ఫామ్‌పై ఎప్పటికప్పుడు చర్చ మొదలైంది. జట్టులో తన స్థానాన్ని మరింత బలపరుచుకోవాలంటే స్థిరంగా పరుగులు సాధించడం ఎంతో అవసరం. రానున్న మ్యాచ్‌ల్లో అతడు తిరిగి ఫామ్‌లోకి వచ్చి భారీ స్కోర్లు సాధిస్తాడా? లేడా? అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Chiranjeevi MEGAVerse : నెట్‌ఫ్లిక్స్‌లో చిరు సెన్సేషన్ ‘మెగావర్స్’.. తొలి ఎపిసోడ్‌లోనే ఆ ముగ్గురు!
-
Ind Vs NZ: సెంచరీతో కదం తొక్కిన కాటేరమ్మ కొడుకు.. పలు ప్రపంచ రికార్డులు బద్దలు..
-
Donald Trump: ట్రంప్‌పై అత్యాచార ఆరోపణలు.. మాజీ మిస్ స్విట్జర్లాండ్ సంచలన వ్యాఖ్యలు!
-
Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..’వృషకర్మ’ వెనుక అసలేం జరిగింది?
-
DA Hike: ఉద్యోగులు, పెన్షన్‌దారులకు శుభవార్త.. రేపే డీఏ పెంపు..?
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!