వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఆహారం విషయంలో తరచూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి వెజ్‌కి బదులు నాన్‌వెజ్ ఫుడ్ ఇవ్వడంతో ఓ ప్రయాణికుడు వెయిటర్‌పై చిరుబుర్రులాడాడు. అంతేకాకుండా.. కోపంతో వెయిటర్‌ని ప్రయాణికుడు చెంపదెబ్బ కొట్టాడు.
తృణమూల్ కాంగ్రెస్ (TMC) కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ (KMC) కౌన్సిలర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె తన పార్టీకి చెందిన యువ నాయకుడిని కొట్టడం కనిపిస్తుంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడంతోనే వివాదం నెలకొంది. ఈ క్లిప్‌ను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ప్రజలు దీనిని చాలా ఖండిస్తున్నారు. ఈ వీడియోలో.. వార్డు నంబర్ 18 మహిళా కౌన్సిలర్ సునంద సర్కార్, వార్డు టీఎంసీ యూత్ ప్రెసిడెంట్ కేదార్ దాస్‌ను…
4వ తరగతి చదువుతున్న చిన్నారిని టీచర్ నిర్దాక్షిణ్యంగా కొట్టిన ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. గురువుగారి నిర్వాకం అంతా సీసీటీవీ ఫుటేజీలో బయటపడింది. 30 నిమిషాల్లో ఉపాధ్యాయుడు 23 సార్లు చెంపదెబ్బ కొట్టాడు. అయితే వచ్చే వారమే గురువుగారి వివాహం జరగనుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులపై చేయి చేసుకోవడం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటా. అయితే ఎక్కువ సందర్భాల్లో ప్రజాప్రతినిధులు వారి సొంత పనుల నేపథ్యంలో ఇటువంటివి చేస్తుంటారు.
రోడ్లమీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలి. హెల్మెట్ పెట్టుకుని నడుపుతున్నా ఒక్కోసారి పోలీసులు ఆపి, తనిఖీలు చేస్తుంటారు. వాహన దారులంటే పోలీసులకు ఎంత అలుసో విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓఘటన నిరూపించింది. తనిఖీలు చేసే సమయంలో వారికి ఎదురు చెబితే ఎంతకైనా తెగిస్తారనే విషయం అందరికీ తెలిసిందే.. బైక్ ఆపేవరకు ఉండకుండా నేరుగా అడ్డుగా రావడం, తాళాలు తీసుకెళ్లడం చేస్తుంటారు… ఇది ఏంటని ప్రశ్నిస్తే, రుబాబు చేస్తున్నారంటూ లాఠీకి పని చెబుతుంటారు. నర్సీపట్నం మున్నిపాలిటీ బలిఘట్టంలో ఆదివారం…