ముందస్తు బెయిల్ ఇచ్చే సందర్భంలో విధించిన షరతుల్లో సడలింపు ఇవ్వాలని ఈ సారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వంశీ.. ఇక, వల్లభనేని వంశీ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టనుంది న్యాయస్థానం..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రెండు రోజుల కస్టడీ పూర్తి అయ్యింది.. రెండు రోజుల పాటు నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో వంశీని ప్రశ్నించారు కంకిపాడు పోలీసులు..
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు నిరాశ ఎదురైంది.. అక్రమ మైనింగ్ కేసులో తనపై పీటీ వారెంట్ దాఖలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ వల్లభనేని వంశీ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిగింది.. అయితే, దిగువ కోర్టు పీటీ వారెంట్ అనుమతించినా వచ్చే గురువారం వరకు వారెంట్ అమలు చేయబోమని కోర్టుకి తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.
వల్లభనేని వంశీ మోహన్‌కు ఊహించని ఝలక్ తగిలినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీపై హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు.. వంశీపై మొత్తం ఆరు కేసులు నమోదు కాగా.. ఇప్పటికే ఐదు కేసుల్లో వంశీకి బెయిల్, ముందస్తు బెయిల్ మంజూరు అయ్యాయి. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాత్రం.. వంశీ బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు వెల్లడించనుంది కోర్టు.. అయితే, ఈ సమయంలో బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో మాజీ…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగినట్టు అయ్యింది.. వల్లభనేని వంశీ రిమాండ్‌ను మరోసారి పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు.. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో నేటితో వల్లభనేని వంశీ రిమాండ్ ముగిసిన నేపథ్యంలో.. వల్లభనేని వంశీని జూమ్ యాప్ ద్వారా విచారించారు న్యాయమూర్తి.. ఆ తర్వాత వంశీకి ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు..
వల్లభనేనిపై మరో ఫిర్యాదు అందింది.. కోనాయి చెరువు రిజర్వాయర్ కు అదనంగా మరో రిజర్వాయర్ నిర్మాణం పేరిట మట్టి తవ్వకాలు చేపట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.. తొండెం గట్టు చెరువులో మట్టి తవ్వకాలు చేసి కోట్లు కొల్లగొట్టినట్టు వంశీ, ఆయన అనుచరులపై గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు మురళీ అనే వ్యక్తి.. దీంతో, వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేసేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు..
మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది.. ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఎందుకుంటే.. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు పోలీసులు.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ71గా ఉన్నారు వంశీ.. మరోవైపు.. ఇప్పటికే ఈ కేసులో 18 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
Vallabhaneni Vamsi Mohan: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్‌పై కౌంటర్ ఎటాక్ చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. చింతమనేని వ్యాఖ్యలపై స్పందించారు.. ముందు వాడి ఊరిలో వాడిని చూసుకోమనండి.. బకెట్ జారిన.. అడుగు జారిన యదవలంతా నానికి, నాకు చెబుతున్నారు.. మంగమ్మ శపథాలు చేస్తున్నారు అంటూ ఫైర్ అయ్యారు.. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి నలుగురు విభేదించిన టీడీపీ వెంటిలేటర్ మీద ఉందా? లేక…