రాజీవ్ గాంధీ పేరుతో 15 ఏళ్ల నుండి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ సారి భారత్ జోడో ఆల్ ఇండియా అండర్ 19 టీ 20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు వెల్లడించారు. ఈ పోటీల్లో దేశ వ్యాప్తంగా 17 టీమ్స్ పాల్గొంటున్నాయని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీకి మద్దతుగా భారత్ జోడో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.
Also Read : SBI Alert: పాన్ నంబర్ లింక్ చేయకపోతే అకౌంట్ బ్లాక్..! క్లారిటీ ఇచ్చిన ఎస్బీఐ
మార్చి 22 నుండి 25 వరకు మొత్తం మూడు క్రీడా మైదానంలో క్రికెట్ మ్యాచ్ లు జరుగుతాయన్నారు. అయితే.. హైదరాబాద్ లో కుక్కల వలన చాలా మంది పిల్లలు చనిపోయారని, ఇంతకుముందు కుక్కలను నియంత్రణ చేసేవారు కానీ ఇప్పుడు చేయడం లేదని ఆయన మండిపడ్డారు. కుక్కల దాడిలో మరణించిన బాలుడి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కుక్కలు పట్టుకోవడానికి టీమ్ ను ఏర్పాటు చేసి నియంత్రణ చేయాలన్నారు. వీధి కుక్కలను నియంత్రణ చేయకపోతే చిన్న పిల్లలపై దాడులు పెరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : NIA Raids: గ్యాంగ్స్టర్లను వెంటాడుతున్న ఎన్ఐఏ.. కీలక సమాచారంతో 8 రాష్ట్రాల్లో దాడులు
జీహెచ్ఎంసీ అప్రమత్తంగా ఉండి కుక్కల బెడద నుండి ప్రజలను కాపాడాలన్నారు. ఛత్తీస్ ఘడ్ లో ఏఐసీసీ ప్లీనరి సమావేశాల సందర్భంగా అక్కడి సీఎం భూపేష్ బాగేల్ సోదరుడికి ఈడీ నోటీసులు ఇచ్చారని, కాంగ్రెస్ సభలు పెట్టుకుంటే బీజేపీకి ఎందుకు భయం ఆయన అన్నారు. ప్రతిపక్షాలు వుండవద్దనే ఉద్దేశ్యంతో బీజేపీ వ్యవహరిస్తోందన్నారు వీహెచ్. కావాలనే కాంగ్రెస్ నేతలను కేసులతో వేధిస్తున్నారని, బీజేపీ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ఛత్తీస్ ఘడ్ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసుల వెనుక అమిత్ షా వున్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నీ బీజేపీ గుప్పిట్లో ఉన్నాయని ఆయన విమర్శించారు.