Etela Rajender : హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో అనేక అంశాలు ఉన్నాయని, స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ హాయంలో బీసీ శాతం 23 కు పడిపోయిందని ఆయన మండిపడ్డారు. బీసీల కళ్లలో మట్టి కొట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీఅని, బీఆర్ఎస్ పార్టీకి…
కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్‌లో స్వాగతం పలికిన జిల్లా కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది సరిగ్గా ఇదే రోజు కామారెడ్డి సభలో బి సి డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయిందని, బీసీ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయి ఒక్కటైనా హామీ చేసిందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన అన్నారు.
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రేపు మంగళగిరిలో టీడీపీ 'జయహో బీసీ' బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభలో టీడీపీ- జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ ప్రకటించనుంది.
ఈ ఏడాది సెప్టెంబర్ 17 లోపుగా అన్ని డిక్లరేషన్లను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. ఇందులో భాగంగానే నేడు ( బుధవారం ) పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో కమిటీని టీపీసీసీ ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ.. గడిచిన 9 సంవత్సరాలుగా గ్యాస్ సిలిండర్ రేటును పెంచుతూ పోయిన కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చే సరికి గ్యాస్ సిలిండర్ రేటును 200 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించడం హాస్యాస్పదమని వీహెచ్ అన్నారు. తాను కూడా బీసీనే అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ.. బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని ఆయన విమర్శించారు.