ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీ హనుమంతరావు సవాల్ విసిరారు. హుజురాబాద్ ఎన్నికల్లో గెలిస్తే నిత్యావసర ధరలు తగ్గిస్తావా..? పబ్లిక్ సెక్టర్ లను అమ్మేది ఆపుతావా ? అంటూ ఈటలకు చాలెంజ్ విసిరారు వీహెచ్. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ… కెసిఆర్ – ఈటల లొల్లి కారణంగానే ఈ ఉపఎన్నిక వచ్చిందని… రాష్ట్రము లో ఉన్న పది హేను లక్షల కుటంబలకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఇస్తే సోనియా కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకుంట అన్న కెసిఆర్.. ఇప్పుడు మాట తప్పారని ఫైర్ అయ్యారు. నిత్యావసరం ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచింది బీజేపీ పార్టీ అన్నారు. ఈటల రాజేందర్ కు మంచి పేరుంది.. కానీ ఆ పార్టీలోకి ఎందుకు పోయాడని ప్రశ్నించారు. ఈటల ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సి ఉండేనని చురకలు అంటించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయాలని పిలుపునిచ్చారు.