Uttam Kumar Reddy: రూ.80 వేల కోట్ల ప్రాజెక్టు.. రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా?
- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తిచేశామని బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది
- కాంగ్రెస్ వచ్చిన తర్వాత తట్టెడు మట్టి కూడా తీయలేదు కేసీఆర్ అన్నారు
- రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా?
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తిచేశామని బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమని.. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని.. రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తట్టెడు మట్టి కూడా తీయలేదు కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. నీటి వాటాలపై తెలంగాణ అసెంబ్లీలో రేపు చర్చ జరగనున్న దృష్ట్యా.. ‘నీళ్లు-నిజాలు’ అంశంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కోసం మంత్రి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
Also Read: Anam Ramnarayana Reddy: నచ్చితే ఎంత?, నచ్చకపోతే ఎంత?.. కేసీఆర్‌పై మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
‘పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తిచేశామని బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తట్టెడు మట్టి కూడా తీయలేదు కేసీఆర్ అన్నారు. 2015లో జీవో ఇచ్చారు. రూ.35 వేల కోట్లు అంచనా వ్యయం ఇచ్చారు, రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు పూర్తవ్వాలంటే రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతుంది. రూ.80 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి 90 శాతం పూర్తిచేశాం అంటే ఎలా?. ఆయకట్టు కాలువలకు అయ్యే వర్క్ కాస్ట్ కూడా లెక్క వేయలేదు. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఎకరాకి కూడా నీళ్లు ఇవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా.. రూ.7 వేల కోట్లు ఖర్చు చేశాం’ అని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సహా ఇతర పథకాలపై కూడా మంత్రి ఉత్తమ్ వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!