పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తిచేశామని బీఆర్ఎస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.80 వేల కోట్లు అవసరమని.. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిందని.. రూ.27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత తట్టెడు మట్టి కూడా తీయలేదు కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. నీటి వాటాలపై తెలంగాణ…