Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మొదట తేరి రీమేక్ అనే ప్రచారం జరిగింది, కానీ తర్వాత కథ మొత్తం మార్చేశారని తెలిసింది. అయితే, ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ తన భాగం షూటింగ్ పూర్తి చేశారు. మిగిలిన షూటింగ్ అయితే ప్రస్తుతం పూర్తి చేసే పనిలో ఉన్నారు హరీష్ శంకర్. పెండింగ్ షూట్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా త్వర త్వరగా పూర్తి చేస్తున్నారు.
నిజానికి, ఈ సినిమాని వచ్చే ఏడాది మహాశివరాత్రికి రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఇప్పుడు సినిమా టీమ్ తమ ప్లాన్ మార్చుతోంది. ఈ సినిమాని మహాశివరాత్రికి కాకుండా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమాని ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. అయితే, అది ఎంతవరకు పాజిబుల్ అవుతుందనే విషయం మీద క్లారిటీ లేదు.
మరోపక్క రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన పెద్ది సినిమా మార్చి 27వ తేదీన రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత రెండు వారాలకి ఈ సినిమా రిలీజ్ అయితే ఇబ్బంది లేదని మేకర్స్ భావిస్తున్నారు. ఒకవేళ తర్వాత మంచి రిలీజ్ డేట్స్ దొరికితే, తర్వాతకి కూడా వాయిదా వేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో హీరోయిన్లుగా శ్రీ లీల, రాశీ ఖన్నా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇక చాలాకాలం తర్వాత దేవి శ్రీ ప్రసాద్, పవన్ కళ్యాణ్ సినిమాకి సంగీతం అందిస్తూ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అందిస్తున్నారు.