ఒక్కసారి చార్జ్ చేస్తే 22 రోజుల స్టాండ్ బై లైఫ్, 50MP సోనీ కెమెరాతో వచ్చేసిన Wobble One స్మార్ట్‌ఫోన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wobble One: భారతీయ మార్కెట్‌లోకి కొత్తగా అడుగుపెట్టిన ఇండ్కాల్ టెక్నాలజీస్‌కు చెందిన Wobble బ్రాండ్ తన తొలి స్మార్ట్‌ఫోన్ Wobble One ను అధికారికంగా లాంచ్ చేసింది. ముందుగా చెప్పిన విధంగానే లాంచ్ అయినా ఈ ఫోన్ ప్రీమియమ్ ఫీచర్లతో మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో పోటిని మరింత పెంచుతోంది. 6.67 అంగుళాల FHD+ 120Hz AMOLED ఫ్లాట్ డిస్‌ప్లే, డాల్బి విజన్ సపోర్ట్‌తో ఈ ఫోన్ విజువల్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మెటల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో రూపొందించిన ప్రీమియమ్ డిజైన్ ఫోన్‌కు హై-ఎండ్ లుక్‌ను అందిస్తుంది.
Manchu Manoj : రక్తదాన శిబిరం ప్రారంభించిన మంచు మనోజ్ – డ్రగ్స్‌పై కఠిన హెచ్చరిక
Also Read
- Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లు!
- Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
- Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
- 3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
పనితీరులో కూడా Wobble One బెస్ట్ గా నిలుస్తోంది. దీనిలోని MediaTek Dimensity 7400 4nm ప్రాసెసర్‌తో పాటు ‘ఎపిక్ హైపర్ ఇంజిన్ గేమింగ్ టెక్నాలజీ’ గేమింగ్, హెవీ మల్టీటాస్కింగ్ సమయంలో ల్యాగ్ లేకుండా స్మూత్ పనితీరును అందిస్తుంది. 12GB వరకు వివిధ ర్యామ్ వేరియంట్లు అందుబాటులో ఉండటం వినియోగదారులకు మరింత వేగవంతమైన అనుభూతిని ఇస్తుంది. కెమెరా పరంగా కూడా ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకుంటుంది. ఇందులో 50MP Sony LYT-600 ప్రధాన కెమెరా OIS సపోర్ట్‌తో వస్తుండగా, 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో కెమెరాలు అదనంగా అందించబడ్డాయి. 50MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీ ప్రేమికులకు పెద్ద ఆకర్షణగా నిలుస్తుంది.

వాబుల్ వన్‌లో 5000mAh బ్యాటరీని అందించారు. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే 47 గంటల కాలింగ్, 24 గంటల వీడియో స్ట్రీమింగ్, 22 రోజుల స్టాండ్ బై లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. తాజా ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్ గూగుల్ AI ఫీచర్లను కలిగి ఉండటంతో పాటు No Bloatware ను అందిస్తుంది. కనెక్టివిటీ పరంగా ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, Wi-Fi 6, బ్లూటూత్ 5.4, USB Type-C 2.0, 5G SA/NSA వంటి ఆధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Wobble One మిథిక్ వైట్, ఎక్లిప్స్ బ్లాక్, ఒడిస్సీ బ్లూ అనే మూడు రంగుల్లో లభ్యం అవుతుంది. ఇక ధరల విషయానికి వస్తే 8GB + 128GB వేరియంట్ రూ. 22,000 గా నిర్ణయించబడింది. అలాగే 8GB+256GB, 12GB+256GB వేరియంట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 12 నుంచి అమెజాన్ తో పాటు ప్రధాన రిటైల్ స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి రానుంది.
Wobble One launches in India
6.67" 120Hz AMOLED + Dolby Vision
Dimensity 7400 SoC
50MP Sony LYT-600 (OIS) + 50MP selfie
5000mAh battery
Android 15, no bloatwareStarting at ₹22,000 | Available Dec 12 on Amazonhttps://t.co/9Pn7hypanP#WobbleOne pic.twitter.com/wD7jDuyRXF
— Piyush Bhasarkar (@TechKard) November 19, 2025
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!