Updated WTC Table 2023-25 after India vs West Indies Test Series: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 సీజన్‌ను ఘనంగా ప్రారంభించిన భారత్‌కు వరుణుడి రూపంలో అడ్డంకి ఎదురైంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో దక్కించుకున్నా.. పెద్దగా ప్రయోజనం లేకపోయింది. రెండో టెస్టులో ఐదో రోజు ఆటకు వర్షం అడ్డు రావడంతో.. క్లీన్‌స్వీప్ చేసే అవకాశం చేజారింది. దీంతో డబ్ల్యూటీసీ 2023-2025 పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
డబ్ల్యూటీసీ 2023-2025 సైకిల్‌లో భారత్ ఇప్పటివరకు రెండు టెస్టులు ఆడింది. ఒక విజయం, ఒక డ్రాతో 16 పాయింట్లు ఖాతాలో ఉన్న భారత్.. పర్సంటేజీలో మాత్రం 66.67 శాతంతో కొనసాగుతోంది. ఈ జాబితాలో దాయాది పాకిస్థాన్ అగ్ర స్థానంలో ఉంది. శ్రీలంకతో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన పాక్.. 12 పాయింట్లు, 100 పర్సంటేజీతో టాప్‌లో కొనసాగుతోంది. యాషెస్ 2023లో ఇప్పటివరకు నాలుగు టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా (54.17), ఇంగ్లండ్ (29.17) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక వెస్టిండీస్ ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకోవడంతో 4 పాయింట్లు సాధించి 16.67 శాతంతో కొనసాగుతోంది.
ఆసియా కప్ 2023, వన్డే ప్రపంచకప్ 2023లు ముందున్నాయి. ఈ టోర్నీల వరకు భారత్ టెస్టు సిరీస్‌లు ఆడే అవకాశాలు చాలా తక్కువ. బీసీసీఐ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో భారత్‌కు టెస్టు సిరీస్ ఉంది. దాంతో భారత్ రెండో స్థానంకు ముప్పు ఉంది. శ్రీలంక, శ్రీలంక జట్ల మధ్య రెండో టెస్ట్ జరుగుతోంది. ఇందులో పాక్ గెలిస్తే.. మరింత ముందుకు దూసుకెళుతుంది. మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య చివరి టెస్టు జులై 27న లండన్ వేదికగా జరగనుంది. ఇందులో ఆసీస్ గెలిస్తే రెండో స్థానానికి చేరే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Moto G14 Launch: మోటొరోలా నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్.. ధర రూ. 15 వేల కంటే తక్కువ!
Also Read: Oppo K11 5G Launch: 5000mAh బ్యాటరీతో సూపర్ స్మార్ట్‌ఫోన్.. 26 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్!