మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. తరచూ సోషల్ మీడియా వేదికగా తమ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. తన తాతయ్య తనకు బోధించిన సనాతన ధర్మం యొక్క నిర్వచనాన్ని ప్రస్తావిస్తూ… ఎక్స్ లో ఓ పోస్ట్ పంచుకుంది. గౌరవ, మర్యాదలతో ఇతరులకు వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మమని తన తాత ఆమెకు చెప్పినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
READ MORE: Beauty Tips: చలికాలంలో మెరిసే చర్మం కోసం ఈ ఫేస్ ప్యాక్‌లను ట్రై చేయండి..
అయోధ్య రామాలయం వద్ద అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించినట్లు ఆమె పేర్కొంది. ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసిన ఆమె.. క్యాప్షన్‌లో.. ‘‘అవసరాలకు అనుగుణంగా సానుభూతి, గౌరవంతో వైద్యాన్ని అందించడమే నిజమైన సనాతన ధర్మం అని తాతయ్య బోధించారు. మా తాతయ్య మాటల నుంచి మేము స్ఫూర్తి పొందాం. తాజాగా అయోధ్య రామ మందిరం వద్ద అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ప్రారంభించాం. తిరుమల, శ్రీశైలం, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లలో ఇప్పటికే ఈ సెంటర్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు రామ జన్మభూమిలో ప్రారంభించడం సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ విషయంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు.
READ MORE: Save The Girl Child: సమాజంలో మొదటి పోలీసింగ్ అమ్మే చేయాలి: హోంమంత్రి అనిత