మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. తరచూ సోషల్ మీడియా వేదికగా తమ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. తన తాతయ్య తనకు బోధించిన సనాతన ధర్మం యొక్క నిర్వచనాన్ని ప్రస్తావిస్తూ... ఎక్స్ లో ఓ పోస్ట్ పంచుకుంది. గౌరవ, మర్యాదలతో ఇతరులకు వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మమని తన తాత ఆమెకు చెప్పినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.. దీంతో ఆయన్ను అపోలో హస్పటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా.. ఈరోజు మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఢిల్లీలోని ఎయిమ్స్, అపోలో సహా పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిమ్స్, ఫోర్టిస్, అపోలో, సర్ గంగారాం వంటి పెద్ద, ప్రఖ్యాత ఆసుపత్రులకు ఏకకాలంలో బెదిరింపు ఇమెయిల్‌లు వచ్చాయి.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అరుదైన ఘనతను చాటుకున్నారు. గ్రీన్ ఛానెల్ ద్వారా 13.46 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 14 నిముషాల్లో చేరుకుని ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. హైదరాబాద్‌లో ప్రయాణం అంటే నరకం. ఎప్పుడు ఎక్కడ ట్రాఫిక్ జాం అవుతుందో తెలీని అయోమయ పరిస్థితి. అయితే, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతూ వుంటారు. గ్రీన్ ఛానెల్ ద్వారా ట్రాఫిక్ ని క్లియర్ చేసి ఎంత దూరమయినా తక్కువ వ్యవధిలో అక్కడికి చేరుస్తుంటారు. ఏవైనా అవయవాలు ఇతర…
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. గౌతమ్ రెడ్డి ఇంట్లో వంట మనిషి కొమురయ్య అసలేం జరిగిందో వివరించారు. ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు దుబాయ్ నుండి వచ్చారు. నిన్న ఉదయం ఇంట్లోనే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం చేశారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత బయట ఫంక్షన్ ఉంది అని చెప్పి వెళ్లారు. తిరిగి రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చారు. అప్పటినుండి ఇంట్లోనే ఉన్నారు.…
మంత్రి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 8.45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. వైద్యులు గౌతమ్‌రెడ్డిని ఐసీయూలో చేర్చి అత్యవసర సేవలు అందించినా ప్రాణాలు దక్కలేదు. దీంతో ఆసుపత్రి వైద్యులు భార్యకు సమాచారం అందించారు. ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మరణంతో అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు కుటుంబ సభ్యులు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం గురించి తెలుసుకొని హుటాహుటిన…
ఏపీలో విషాదం నెలకొంది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో సోమవారం ఉదయం మరణించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వారం రోజుల పాటు దుబాయ్ పర్యటన ముగించుకుని ఆదివారమే హైదరాబాద్ కు తిరిగి వచ్చిన మంత్రి గౌతమ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఆయన వయసు 50 ఏళ్ళు. ఇటీవల వారం రోజులపాటు దుబాయ్ ఎక్స్‌పోలో పాల్గొన్నారు గౌతమ్‌రెడ్డి. జగన్ కేబినెట్లో ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా…