కాంగ్రెస్, బీఆర్ఎస్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు చేయడం కోసం ప్రజలు అనేక త్యాగాలు చేశారు.. అనేక బలి దానాలు త్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ మొదటి పది సంవత్సారాలు కేసీఆర్ చేతిలో బంది అయ్యిందని ఆరోపించారు. అరాచకాలకు తెలంగాణ సమాజం ఏ రకంగా ఇబ్బంది పడిందో అందరికీ తెలుసు.. ధర్నా చౌక్ లో ధర్నా చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం గజ్జె కట్టిన వారే కేసీఆర్ ను వ్యతిరేఖించారన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన పూర్తి చేసుకుందని కిషన్ రెడ్డి తెలిపారు.
Chandrababu: ప్రజల సంక్షేమం, అభివృద్ధే మా అజెండా..
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు వచ్చి గ్యారెంటీలు ప్రకటించారు.. కానీ ఆ గ్యారెంటీలకు గ్యారెంటీ లేకుండా పోయిందని విమర్శించారు. మహిళలకు 2500 రూపాయిలు ఇస్తామని ప్రకటించారు..రాష్ట్రంలో ఎంత మంది మహిళలు ఉన్నారో ప్రభుత్వం దగ్గర రికార్డ్ ఉందని తెలిపారు. కానీ అది అమలు చేయడానికి మీన మేశాలు లెక్కబెడుతుందని విమర్శించారు. రైతులకు 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. పేద వారికి ఇళ్లు ఇస్తా అన్నారు.. మరి ఎలా ఇస్తారో విధి విధానాలు చెప్పడం లేదని తెలిపారు.
Manisha Koirala: నా భర్తే నాకు శత్రువయ్యాడు..పెళ్ళైన ఆరు నెలలకే..
నిరుద్యోగ యువత రాష్ట్ర సాధనకు పని చేశారని అన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించడానికి కూడా నిరుద్యోగుల పాత్ర పెద్దది.. ఆ నిరుద్యోగులకు కూడా కాంగ్రెస్ ఈ వంద రోజుల పాలనలో వెన్ను పోటు పొడిచిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. అమ్మాయిలకు స్కూటీలు ఇస్తా అన్నారు.. వంద రోజుల్లో రెండో విడత గొర్రెల పంపిణీ అన్నారు.. 2 వేల పెన్షన్ 4 నాలుగు వేలు చేస్తా అన్నారు.. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడగానే రేషన్ కార్డులు ఇస్తా అన్నారని తెలిపారు. రేషన్ పై బియ్యం ఉచితంగా ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ఇలా గ్యారెంటీలు చెప్పారు కానీ అమలు చేయలేదని మండిపడ్డారు. అందుకే బీజేపీ తెలంగాణను ప్రశ్నిస్తుందని చెప్పారు. ఎవరైతే ప్రజలు ఈ గ్యారెంటీల్లో మోసపోయారో.. వారందరినీ కలుస్తామని తెలిపారు. తెలంగాణా ప్రజల తరుపున బీజేపీ నిలబడి ప్రశ్నిస్తుందని పేర్కొన్నారు.