Manisha Koirala: మనీషా కోయిరాలా.. ఈ పేరు వినగానే ఒకే ఒక్కడు, బొంబాయి సినిమాలు గుర్తొస్తాయి. ఉట్టి మీద కూడు.. ఉప్పు చేప తోడు అంటూ కుర్రకారును ఉర్రూతలూగించినా.. ఉరికే చిలుకా.. వేచి ఉంటాను కడవరకు అంటూ విరహ వేదనలో పెట్టింది ఆమె అందం. ఎన్నో హిట్ సినిమాలు తీసి మెప్పించిన ఈ చిన్నది.. మధ్యలో ఎన్నో వివాదాలను ఎదుర్కొంది.. ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడింది. ప్రాణాంతకమైన వ్యాధి క్యాన్సర్ నుంచి బయటపడి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఇక ప్రస్తుతం రీఎంట్రీలో అమ్మడు దూసుకుపోతుంది. వరుస వెబ్ సిరీస్ లతో మెప్పిస్తుంది. అమ్మడి కెరీర్ నుంచి పక్కన పెడితే..మనిషా కెరీర్ లో చేసిన అతిపెద్ద తప్పు పెళ్లి చేసుకోవడం.. ఈ విషయం తనే స్వయంగా చెప్పుకొచ్చింది. 2010 లో సామ్రాట్ దాహల్ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకుంది. ముచ్చటగా మూడేళ్లు కూడా నిండకుండానే వీరు విడిపోయారు. అప్పట్లో ఇదో పెద్ద సంచలనమనే చెప్పాలి.
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనీషా తన మాజీ భర్త గురించి, విడాకుల గురించి నోరు విప్పింది. ” నా జీవితంలో నేను ప్రేమించని వ్యక్తి ఒకరే. పెళ్లి అయినా ఆరునెలలకే నా భర్త నాకు శత్రువయ్యాడు. ఇంతకుమించిన దురదృష్టమైన విషయం ఏ ఆడదానికి ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక మనీషాకు ఇండస్ట్రీలో చాలా ఎఫైర్లు ఉన్నాయని టాక్. అందులో నిజమెంత అనేది ఇప్పటివరకు తెలియకుండానే పోయాయి. ప్రస్తుతం మనీషా వరుస సినిమాలతో బిజీగా మారింది.