NTV Telugu Site icon

Kishan Reddy: రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు.. నవంబర్1 నుంచి బీజేపీ ఉద్యమ బాట..

Kishanreddy

Kishanreddy

ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 2014 లో బీజేపీ సభ్యత్వ సేకరణ తర్వాత 2024 లో చేస్తున్నామన్నారు. సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి మాట్లాడారు. నూతనంగా గ్రామీణ మండల జిల్లా వ్యాప్తంగా నూతన కమిటీ సేకరణ ఏర్పాటు చేస్తామన్నారు. నవంబర్ 1 నుంచి బీజేపీ ఉద్యమ బాట పట్టనుందన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 సంవత్సరాల పాలనలో గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించాయని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రం వెనుకబడిందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ సరిగా పథకాలు అమలు కాలేదని ఆరోపించారు.

READ MORE: Wifi Password: పాస్‌వర్డ్‌తో పనిలేదు.. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే చాలు!

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ తరహాలోనే వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి విమర్శించారు. పేదలకు ఇల్లు కట్టకుండా పేదల ఇళ్లను కోల్స్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజల వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం కూడగట్టుకుందని తెలిపారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేశారని… కాంగ్రెస్ ప్రభుత్వం మూసి సుందరీకరణ పేరుతో రూ.లక్ష 80 వేల కోట్ల బడ్జెట్‌ కేటాయించి ఇంతవరకు డీపీఆర్ తయారు చేయలేదన్నారు. కాంగ్రెస్‌పై వ్యతిరేకతతోనే హర్యానా రాష్ట్రంలో బీజేపీకి ప్రజలు పట్ట కట్టారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సహకరించకుండా కూడా ముందుకు పోనున్నట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో బీజేపీకి గణనీయంగా ఓట్ల శాతం పెరిగిందని పార్టీని కొనియాడారు. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి అధిక ఓట్లు రావడం విశేషమన్నారు.

READ MORE:Inida-Canada: ఇరు దేశాల మధ్య ముదురుతున్న వివాదం.. కెనడా దౌత్యవేత్తకు భారత్ సమన్లు