భారత్-కెనడా మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి. కెనాడా అనుసరిస్తున్న విధానాలు తీవ్ర విదాదాలకు దారితీస్తోంది. ఖలీస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితుల జాబితాలో చేర్చింది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారుతున్నాయి.
ఇది కూడా చదవండి: Minister Nimmala Rama Naidu: నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు పునః ప్రారంభం
సంజయ్ కుమార్ వర్మను హత్య కేసులో అనుమానితుడిగా చేర్చడంపై భారత్ మండిపడుతోంది. దీంతో కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్‌కు భారత విదేశాంగశాఖ సమన్లు జారీ చేసింది. కెనడా విధానాన్ని అసంబద్ధ చర్యగా భారత్ ఆరోపించింది. 2023లో కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేసిన నాటి నుంచి వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలను భారత్‌తో పంచుకోలేదని విదేశాంగశాఖ వెల్లడించింది. ఇప్పటికే తాము పలు మార్లు ఆ దేశ సర్కారును అభ్యర్థించామని వెల్లడించింది. రాజకీయ లబ్ధికోసమే తాజాగా ఎటువంటి ఆధారాలు లేకుండా భారత్‌పై విమర్శలు చేస్తున్నట్లుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 నుంచే భారత్‌తో ప్రధాని ట్రూడో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నట్లు ఆధారాలున్నాయ విదేశాంగ శాఖ ప్రకటనలో పేర్కొంది.
ఇది కూడా చదవండి: Mahesh Kumar Goud: కొండా సురేఖ – రేవూరి అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్..
ఇదిలా ఉంటే ఇటీవల ఆసియాన్ సమావేశాల సందర్భంగా లావోస్‌లో భారత ప్రధాని మోడీ, కెనడా ప్రధాని ట్రూడో భేటీ అయినట్టు సమాచారం. అయితే ఇరువురి మధ్య ఎటువంటి చర్చలు జరగలేదని భారత్ స్పష్టంచేసింది. కేవలం వారిద్దరూ ఎదురుపడ్డారని భారత్ అధికారులు తెలిపారు.