World Skydiving Day: 12 వేల మీటర్ల ఎత్తు నుంచి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ స్కైడైవింగ్..
- ప్రపంచంలోనే తొలిసారిగా శనివారం ప్రపంచ స్కైడైవింగ్ దినోత్సవం
- 12 వేల మీటర్ల ఎత్తు నుంచి దూకి స్కై డైవింగ్ చేసిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్
- హరియానాలో తొలి స్కైడైవింగ్ ట్రైనింగ్ కేంద్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలో ప్రైవేట్ స్కైడైవింగ్ సౌకర్యాన్ని ప్రారంభించడం చాలా సంతోషదాయకమని కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా శనివారం ప్రపంచ స్కైడైవింగ్ దినోత్సవాన్ని జరుపుకుంటుండగా.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ 12 వేల మీటర్ల ఎత్తు నుంచి దూకి స్కై డైవింగ్ చేశారు. ప్రపంచ స్కైడైవింగ్ దినోత్సవం సందర్భంగా హర్యానా రాష్ట్రం మహేంద్రగఢ్ జిల్లాలోని బచోడ్ గ్రామంలో ఎయిర్‌స్ట్రిప్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యారు. గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. “ప్రపంచ స్కై డైవింగ్ దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని నార్నాల్‌లో స్కై డైవింగ్ సదుపాయం ప్రారంభమైంది. నేను ఈ కార్యక్రమంలో పాల్గొనటంతో పాటు స్కై డైవింగ్ చేయడం ఉత్సాహాన్ని ఇచ్చింది. భారత పర్యాటక శాఖ మంత్రిగా, ప్రతి ఒక్కరికీ సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడడం నా బాధ్యత. భద్రతా ప్రమాణాలతో కూడిన ఈ స్కై డైవింగ్ ని ఆస్వాధిస్తారు. ” అని వ్యాఖ్యానించారు. అకాడమీని అభినందించారు.
READ MORE: Job Fraud Case: గిగ్లైజ్ కంపెనీ సీఈవోను కిడ్నాప్ చేయలేదు- జాగృతి కన్సల్టెన్సీ బాధితులు..
Also Read
అనంతరం స్కై హై కంపెనీ వ్యవస్థాపకుడు దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. “ఈ ఎయిర్‌స్ట్రిప్‌లో యువతకు స్కైడైవింగ్ నేర్పి్స్తున్నాం. భారతదేశంలో స్కైడైవింగ్ నేర్పించే ఏకైక ఎయిర్‌స్ట్రిప్ ఇదే. పూర్వం భారతదేశంలోని ప్రజలు స్కైడైవింగ్ నేర్చుకోవడానికి విదేశాలకు వెళ్లేవారు. భారతదేశ సైన్యంలో స్కైడైవింగ్ పర్వతాల నుంచి మాత్రమే నేర్పిస్తారు. అయితే ఇప్పుడు.. విమానం పై నుంచి స్కైడైవింగ్ నేర్పిస్తున్నాం. ఈ ఎయిర్‌స్ట్రిప్‌లో ఇప్పటివరకు 7500 సురక్షితమైన స్కైడైవ్‌లు జరిగాయి. ఈ సంస్థ నాలుగు రోజుల ఏడు రోజుల రెండు కోర్సులను నిర్వహిస్తుంది. ఒక్క జంప్‌నకు ముప్పై వేల రూపాయలు వసూలు చేస్తున్నాం.” అని తెలిపారు.
తాజావార్తలు
-
Delhi: బ్రిక్స్ డ్యూటీలో సెక్యూరిటీ సిబ్బంది తుపాకీలతో రీల్స్.. ఒకరు సస్పెండ్
-
UP Elections: యూపీలో బీజేపీకి ‘‘కర్ణిసేన’’ తలనొప్పి.. 50 స్థానాల్లో పోటీ..
-
CM Revanth Reddy : ఇందిరమ్మ ఇళ్లు అమ్ముకోవచ్చు కానీ..
-
Finance Ministry: ట్రంప్ ఒత్తిడి ఉందా?.. యూపీఐ ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..
-
Central Cabinet Decision: ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఈపీఎఫ్ పరిమితి పెంపు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!