Amit Sha: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి అమిత్ షా సవాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం రేవంత్ రెడ్డికి అమిత్ షా సవాలు విసిరారు. కాంగ్రెస్ చేసిన స్కాంల లిస్ట్ పంపిస్తా.. అవినీతి జరిగిందా లేదా రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేని దేశంలో ఏకైక ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అని అన్నారు. సీఎంగా చేసినప్పుడు కూడా మోడీ పై అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. పేదరిక నిర్మూలన కోసం కాంగ్రెస్ ఏమి చేయలేదని.. 80 కోట్లకు పైగా ప్రజలకు ఉచితంగా రేషన్ ఇచ్చింది మోడీ సర్కారని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్రంలో ఈసారి 400 సీట్లు రావాలి.. తెలంగాణ నుంచి 12కి పైగా స్థానాలు గెలిపించాలని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ ఒకవైపు బీజేపీ ఒకవైపు అని అమిత్ షా చెప్పారు.
Russia: కుప్పకూలిన రష్యా మిలిటరీ కార్గో విమానం.. 15 మంది దుర్మరణం..
Also Read
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు మజ్లిస్ గుప్పిట్లో ఉన్నాయి.. ఆ రెండు పార్టీలతో నిజాం పాలన విముక్త తెలంగాణ సాధ్యం కాదని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కుటుంబ పార్టీలేనని ఆరోపించారు. జవహర్ లాల్ నెహ్రూ కుటుంబ పార్టీ కాంగ్రెస్.. కేసీఆర్, కేటీఆర్ ల పార్టీ బీఆర్ఎస్ అని దుయ్యబట్టారు. దేశంలో అన్నివర్గాల ప్రజల పార్టీ బీజేపీ అని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు అవినీతి పార్టీలు అని మండిపడ్డారు. 2జీ స్కాం, భోఫార్స్ కుంభకోణం ఇలా దేశంలో కాంగ్రెస్ చేయని అవినీతి లేదని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్ కాళేశ్వరం మొదలు ఎన్నో అవినీతి చేశారు.. కవితకు లిక్కర్ స్కాంలో ఆరోపణలున్నాయని తెలిపారు.
Salman Khan : ఆ సౌత్ స్టార్ డైరెక్టర్ తో కొత్త సినిమా ప్రకటించిన సల్మాన్ ఖాన్..
ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు రక్షణ కల్పించారని అమిత్ షా పేర్కొన్నారు. దేశం మోడీ పాలనలో సురక్షంగా ఉంది.. పాకిస్తాన్ ఆటలు మోడీ సాగనివ్వలేదని అన్నారు. CAA తీసుకొచ్చి మూడు దేశాల ముస్లిమేతర శరణార్థులకు సిటిజన్ షిప్ మోడీ సర్కారు ఇస్తోందని తెలిపారు. దేశ విద్రోహ శక్తులకు తప్ప CAA ఎవరికి వ్యతిరేకం కాదు.. CAA సామాన్య శరణార్థులకు వ్యతిరేకం కాదు అని అన్నారు. తెలంగాణ అభివృద్ది కేవలం మోడీ సర్కారుతో సాధ్యం అని తెలిపారు. సోనియా గాంధీకి రాహుల్ గాంధీని పీఎం చేయాలని.. కేసీఆర్ కు కేటీఆర్ ను సీఎం చేయాలని లక్ష్యం అని అమిత్ షా తెలిపారు. దేశంలో బీజేపీ తప్ప అన్ని పార్టీలు కుటుంబాల కోసమేనని అన్నారు. మోడీ సర్కారు మాత్రం భారత కుటుంబ కోసం అని తెలిపారు. ప్రపంచ దేశాల్లో మోడీకి దక్కుతున్న అపూర్వ స్వాగతం మోడీది కాదు.. యావత్ భారత ప్రజలకు దక్కుతున్న గౌరవం అని పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ ను మూడో అగ్ర దేశంగా నిలపడమే మోడీ లక్ష్యం అని అమిత్ షా తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్‌తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్‌హౌస్‌కు జెలెన్స్కీ.. ట్రంప్‌తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!