Salman Khan : ఆ సౌత్ స్టార్ డైరెక్టర్ తో కొత్త సినిమా ప్రకటించిన సల్మాన్ ఖాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ 3 చిత్రం గతేడాది నవంబర్‌లో విడుదలై మోస్తరు విజయం అందుకుంది.కత్రీనా కైఫ్ హీరోయిన్‍గా నటించిన ఆ చిత్రానికి మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు.అలాగే, టైగర్ వర్సెస్ పఠాన్ చిత్రంలో షారూఖ్ ఖాన్‍తో కలిసి సల్మాన్ కూడా నటించనున్నారు. అయితే, ఈ తరుణంలో తన తదుపరి మూవీని సల్మాన్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. తమిళ స్టార్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‍తో ఆయన సినిమా చేయనున్నారు.సల్మాన్ ఖాన్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‍లో రానున్న ఈ చిత్రానికి సాజిద్ నడియడ్‍వాలా నిర్మాతగా వ్యహరించనున్నారు. సాజిద్ నిర్మాణంలో సల్లూ భాయ్ కిక్ మరియు జుడ్వా సహా మరిన్ని మూవీస్ చేశారు. ఆయన దర్శకత్వంలో కిక్ మూవీలోనూ నటించారు. ఇప్పుడు మరోసారి ఆయన బ్యానర్‌లో సినిమా చేయనున్నారు. ఈ కొత్త సినిమా గురించి సల్మాన్ ఖాన్ నేడు (మార్చి 12) ట్వీట్ చేశారు.”
అద్భుత టాలెంట్ ఉన్న ఏఆర్ మురుగదాస్ మరియు నా స్నేహితుడు సాజిద్ నడియడ్‍వాలాతో ఓ ఎగ్జైటింగ్ సినిమా కోసం కలిసి పని చేయనున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భాగస్వామ్యం చాలా ప్రత్యేకమైనది. మీ ప్రేమ, ఆశీర్వాదంతో ఈ జర్నీ కోసం నేను వేచిచూస్తున్నా” అని సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు.2025 ఈద్‍కు ఈ చిత్రం రిలీజ్ అవుతుందని సల్మాన్ ఖాన్ తెలిపారు. తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన ఏఆర్ మురుగదాస్.. ఆమిర్ ఖాన్‍తో గజినీ హిందీ రీమేక్ తర్వాత బాలీవుడ్‍లో కూడా బాగా ఫేమస్ అయ్యారు. గజినీ మూవీ బాలీవుడ్‍లోనూ భారీ బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మరో రెండు హిందీ చిత్రాలు కూడా చేశారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్‍తో భారీ మూవీ చేయనున్నారు.సల్మాన్ ఖాన్ , ఏఆర్ మురుగదాస్ కాంబోలో ఈ చిత్రం భారీ బడ్జెట్‍తో రూపొందనుందని తెలుస్తోంది. ఇండియాలోని కొన్ని లొకేషన్లతో పాటు పోర్చుగల్ మరియు యూరోపియన్ దేశాల్లో ఈ మూవీ షూటింగ్ జరగనుందని పింక్‍విల్లా రిపోర్ట్ వెల్లడించింది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్‍తో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఇది తెరకెక్కుతుందని తెలుస్తోంది.
Also Read
- Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
- Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
Glad to join forces with the exceptionally talented, @ARMurugadoss and my friend, #SajidNadiadwala for a very exciting film !! This collaboration is special, and I look forward to this journey with your love and blessings. Releasing EID 2025.@NGEMovies @WardaNadiadwala pic.twitter.com/dv00nbEBU1
— Salman Khan (@BeingSalmanKhan) March 12, 2024
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?