Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన కలిగించి, సమాజంలో ప్రాంతీయ, వర్గాల మధ్య చీలిక తీసుకువచ్చేలా వైసీపీ అరాచక చర్యలకు పాల్పడుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రతి సందర్భంలోనూ దుష్ట శక్తులతో కలిసి దురుద్దేశంతో దాడులకు తెగబడుతూ తీవ్రమైన హింసను ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. సమాజంలో ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉండే ఉపాధ్యాయులు, గురువులపైన వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం గౌరవం లేదని స్పష్టం చేశారు. కోవిడ్ కష్టకాలంలో ఉపాధ్యాయులను కనీస మానవత్వం లేకుండా మద్యం షాపుల వద్ద డ్యూటీలకు నిలబెట్టారని, వైఎస్ జగన్కు ఉపాధ్యాయుల పట్ల ఉన్న గౌరవం ఏపాటిదో అది నిరూపిస్తోందని విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ దానికి విరుద్ధంగా దుష్ట శక్తులతో చేతులు కలిపి ప్రజాస్వామిక వ్యవస్థలపై దాడులు చేయడం సరికాదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్కు ఏపీపీఎస్సీ (APPSC), డీఎస్సీ (DSC)లకు మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసం కూడా తెలియకపోవడం శోచనీయమని ఎద్దేవా చేశారు. నిజంగా డీఎస్సీ నిర్వహణపై ఏవైనా అవకతవకలు జరిగాయని భావిస్తే, పారిపోకుండా శాసనసభకు వచ్చి ధైర్యంగా మాట్లాడాలని సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం స్కామ్ ఏ స్థాయిలో జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని అన్నారు. గత ఐదేళ్లలో ఏకంగా రూ.1.30 లక్షల కోట్ల మేర మద్యం లావాదేవీలు జరిగితే, అందులో కేవలం రూ.600 కోట్లు మాత్రమే డిజిటల్ పేమెంట్లు జరిగాయని, మిగిలిన లక్ష కోట్లకు పైగా నగదు రూపాయల్లోనే దోచుకున్నారని ఆరోపించారు. వారి హయాంలో సరఫరా చేసిన కల్తీ మద్యం తాగి ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి రాష్ట్రంలో అరాచక సంస్కృతికి బీజం వేసిందే వైఎస్ జగన్ అని మండిపడ్డారు.
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
గతంలో చేసిన పాపాలు తొలగించుకోవాలంటే వైసీపీ నాయకులు ప్రజల తరఫున నిజాయితీగా పోరాటం చేయాలని మంత్రి సూచించారు. రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రజా సమస్యలపై పొలిటికల్ డిబేట్ చేయాలని అన్నారు. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నది ప్రజా సమస్యలపై సభలో మాట్లాడడానికేనని, కాబట్టి వైఎస్ జగన్ వెంటనే అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై మాట్లాడాలని కోరుతున్నామన్నారు. లిక్కర్ స్కామ్, ఎక్సైజ్ కుంభకోణంలో ఈడీ (ED) పూర్తిస్థాయి రంగంలోకి దిగడంతో భయం పట్టుకుని, దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే వైఎస్ఆర్సీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ తెరిచారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న మెగా డీఎస్సీ నియామకాలు ఆపాలనే దుర్బుద్ధితోనే జగన్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!