సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రీల్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. విలేజ్ నుంచి సిటీ వరకు మహిళలు, పురుషులు, పిల్లలు అనే తేడా లేకుండా, ప్రతి ఒక్కరు రకరకాల కంటెంట్ తో ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నారు. అయితే ఒక్కోసారి ఒళ్లు మరిచి రీల్స్ చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. రీల్స్ కారణంగా కుటుంబాల్లో కలహాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బీహార్ లో రీల్స్ చేసిన ఓ కోడలికి ఆమె మామ ఊహించని షాకిచ్చాడు. ఆమె తలపై వెదురు కర్రతో దాడికి పాల్పడ్డాడు.
Also Read:IPL 2025: చితక్కొట్టిన GT ఓపెనర్లు.. 3 జట్లకు ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్
కోడలు సునీతా దేవి రీల్స్ చేస్తోంది. ఆమె మామకి ఇది నచ్చలేదు. సంప్రదాయం, సంస్కృతి, గౌరవాన్ని చెడగొడుతున్నాంటూ కోడలిపై వెదురు కర్రతో దాడి చేసి ఆమె తల పగలగొట్టాడు. 26 ఏళ్ల సునీతా దేవి కర్జైన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని చిత్ మోతీపూర్ వార్డ్ నంబర్ 3 నివాసి. తన భర్త కోరిక మేరకు సునీత ఆదివారం ఉపవాసం మీద రీల్ చేసింది. రీల్ చూసిన తర్వాత అత్త, మామ కోపం ఆకాశానికి తాకింది. కోపంతో ఉన్న మామ తన కోడలి తలని వెదురు కర్రతో పగలగొట్టాడు.
Also Read:IPL 2025: ఆందోళనలో కావ్య.. ట్రావిస్ హెడ్‌కు డేంజరస్ వైరస్
రక్తసిక్తమైన స్థితిలో సునీతను భర్త ఆసుపత్రికి తీసుకెళ్లాడు. గాయపడిన సునీతకు చికిత్స అందించారు. గాయపడిన మహిళ మాట్లాడుతూ.. రీల్ చేసినందుకు తన అత్త, మామ తనను కొట్టి, తల పగలగొట్టారని చెప్పింది. ఆ మహిళ ప్రమాదం నుంచి బయటపడింది. ఈ సంఘటన గురించి డయల్ 112 పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.