Tirumala: తిరుమలలో రేపు ఉగాది ఆస్థానం.. తగ్గిన భక్తుల రద్దీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఏప్రిల్ 9న) శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి ఓ ప్రకటనలో తెలిపింది. ఉగాది పర్వదినం సందర్బంగా రేపు ఉదయం 3 గంటలకు సుప్రభాతం సేవ నిర్వహించిన తర్వాత శుద్ధి చేస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, విష్వక్సేనుల స్వామికి విశేష సమర్పణ చేయనున్నట్లు పేర్కొన్నారు.
Read Also: AP News: ఏపీలో బదిలీ అయిన ఐఏఎస్ అధికారులకు పోస్టింగులు..
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
అలాగే, రేపు ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించనున్నారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింప చేసి పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించనున్నారు. బంగారు వాకిలి దగ్గర ఉగాది ఆస్థానాన్ని ఆగమ పండితులు, అర్చకులు నిర్వహించనున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు (ఏప్రిల్ 9న) ఆర్జిత సేవలైన అష్టదళ పాదపద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ క్యాన్సిల్ చేసింది. ఇక, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. గత కొన్ని రోజులుగా రద్దీగా ఉన్న తిరుమల క్షేత్రంలో ఇవాళ భక్తుల కోలాహలం తగ్గినట్లు టీటీడీ తెలిపింది. భక్తులు కంపార్ట్ మెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తున్నారు.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!