Road Accidents: తెలంగాణ రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం ఐదుగురు మృతి చెందారు. ఒకటి రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తమ్మలోనిగూడ గేట్ వద్ద, మరొకటి నిర్మల్ జిల్లా దిల్ వార్‌పూర్ లో చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగిలించాయి.
Also Read: ACB Raids: ఇరిగేషన్ ఇంజనీర్ ఇంటిపై ఏసీబీ సోదాలు.. 12 ప్రాంతాల్లో ఒకేసారి దాడులు..!
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తమ్మలోనిగూడ గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాగార్జునసాగర్ రహదారిపై ఓ కారును బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన సాయితేజ, పవన్, రాఘవేంద్రగా గుర్తించారు. సమాచారం మేరకు, మంగళవారం ఏడు మంది స్నేహితులు నాగార్జునసాగర్ పరిధిలోని వైజాగ్ కాలనీకి విహారయాత్రకు వెళ్లారు. అర్ధరాత్రి తిరిగి వస్తుండగా మాల్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: WTC Final: నేడే WTC ఫైనల్.. ఆసీస్ దూకుడుకి ప్రొటీస్ బ్రేక్ వేయగలదా..?
మరోవైపు నిర్మల్ జిల్లా దిల్ వార్‌పూర్ మండలంలోని జాతీయ రహదారిపై మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. గుర్తు తెలియని వాహనం ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను షేక్ అనిఫ్, సయ్యద్ అర్బర్గా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.