WTC Final: ప్రపంచ క్రికెట్ అభిమానుల దృష్టి నేడు లండన్ లోని లార్డ్స్ మైదానంపైనే ఉంది. ఎందుకంటే నేటి నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) మూడో ఎడిషన్ ఫైనల్ మొదలుకానుంది. 2023-25 సీజన్‌కు సంబంధించిన ఈ టెస్టు మహా సమరంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. రెండు జట్లు ఈ ఫైనల్‌కు తమ పూర్తి సన్నద్ధతతో సిద్ధమయ్యాయి. ఇదే వేదికపై గతేడాది ఫైనల్ లో భారత్‌పై విజయం సాధించిన ఆసీస్ మరోసారి టైటిల్ గెలుచుకునే ఆశతో బరిలోకి దిగుతోంది.
Read Also: Mulugu: ములుగు జిల్లాలో మంత్రుల పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..!
అయితే ఒక్కరోజు ముందే ఇరుజట్లు వారి ప్లేయింగ్ XI ఆటగాళ్లను ప్రకటించడం విశేషం. ఇక ఇందులో ఆసీస్ జట్టును చూస్తే.. కెమెరూన్ గ్రీన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. ఇక మార్నస్ లబుషేన్ ఈసారి ఓపెనర్‌గా ఆడనున్నాడు. ఈ వ్యూహాత్మక మార్పులతో ఆసీస్ దూకుడుగా ఆడేలా కనిపిస్తోంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు కూడా యువ జట్టుతో కాస్త బలంగానే కనిపిస్తోంది.
Read Also: YS.Jagan: నేడు ప్రకాశం జిల్లాలో జగన్ పర్యటన.. రైతులకు పరామర్శ
ఇకపోతే ఈసారి డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రైజ్‌మనీ క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా ఉండటం విశేషం. విజేత జట్టుకు 3.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ.30.8 కోట్లు), రన్నరప్ జట్టుకు 2.1 మిలియన్ డాలర్లు (సుమారు రూ.17.94 కోట్లు) అందనున్నాయి. గత డబ్ల్యూటీసీ సీజన్ (2021-2023)లో ఆసీస్ విజేతగా నిలిచి 1.6 మిలియన్ డాలర్ల బహుమతి అందుకుంది. రన్నరప్ గా నిలిచిన భారత్ కు అప్పట్లో కేవలం 8 లక్షల డాలర్లే లభించాయి. ఈసారి బహుమతులు డబుల్ చేసింది ఐసీసీ. ఇక నేడు ఆడబోయే ఇరుజట్ల వివరాలు ఇలా ఉండనున్నాయి.
ఆస్ట్రేలియా జట్టు: ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కెరీ (W), పాట్ కమిన్స్ (C), మిచెల్ స్టార్క్, నాథన్ లైయన్, జోష్ హేజిల్‌వుడ్.
దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బావుమా (C), ఐదెన్ మార్‌క్రమ్, ర్యాన్ రికెల్‌టన్, వియాన్ ముల్డర్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్ హామ్, కైల్ వెరినే, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.