Dhanush Divorce: అభిమానుల ఆశలన్నీ వమ్ము.. సంచలన నిర్ణయం తీసుకున్న ధనుష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Dhanush -Aishwarya Rajinikanth have filed for divorce at the Chennai family court : 2022 జనవరిలో మేము విడిపోతున్నామని వేరువేరుగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన తమిళ స్టార్ హీరో ధనుష్ మరో స్టార్ హీరో కుమార్ ఐశ్వర్య రజినీకాంత్ ఎట్టకేలకు ఈ వివాహ బంధాన్ని ముగించేందుకు ముందుకు వచ్చారు. తమకు మ్యూచువల్ కన్సల్ట్ డైవర్స్ మంజూరు చేయాలని కోరుతూ సినీనటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2004లో జరిగిన తమ వివాహాన్ని రద్దు చేయాలని అదే పిటీషన్ లో వారు కోరారు. ఈ పిటిషన్‌పై త్వరలో విచారణ జరగనుంది. నటుడు ధనుష్ – రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి నవంబర్ 18, 2004న వివాహం చేసుకున్నారు. వీరి వివాహం చెన్నైలో జరిగింది. ఇక వీరికి లింగ, యాత్ర అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత వీరి వైవాహిక జీవితంలో విభేదాలు రావడంతో గత కొన్నేళ్లుగా ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు.
Kangana Raunat: ఖరీదైన కారును కొన్న కంగనా..ఎన్ని కోట్లో తెలుసా?
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
2022 జనవరిలో, ఇద్దరూ విడిపోయామని వారి సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రకటించడం గమనార్హం. ఐశ్వర్య మరియు ధనుష్ ఇద్దరి పిల్లలు ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నారు కాబట్టి పిల్లలను చూసుకునే బాధ్యతను ఇద్దరూ నిర్వహిస్తున్నారు. వారు 2022లో విడిపోయారని ప్రకటించినప్పుడు, షాక్‌కు గురైన అభిమానులు, “వారు ఇంకా విడాకులు తీసుకోలేదు, వారు ఎలాగైనా తిరిగి కలుసుకుంటారు” అని అనుకున్నారు. అయితే ఇప్పుడు వారి బంధం అధికారికంగా ముగిసినట్టే చెప్పాలి. ధనుష్‌తో ఐశ్వర్య రజనీకాంత్ 3 సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ కాకపోయినా యువతలో మంచి ఆదరణ పొందింది. అదేవిధంగా ధనుష్ ఆమె డైరెక్ట్ హేసినా ‘వై రాజా వై’ చిత్రంలో అతిథి పాత్రలో నటించాడు. ఇక ప్రస్తుతం ధనుష్ తను దర్శకత్వం వహిస్తున్న ఇళయరాజా బయోపిక్ విడుదలలో బిజీగా ఉండగా, ఐశ్వర్య తన ఫిట్‌నెస్ మరియు సినిమా కెరీర్‌పై కూడా దృష్టి పెట్టింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!