భూకంపం కారణంగా టర్కీలో ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించడం కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
టర్కీ, ,సిరియాల్లో విషాదం తాండవిస్తోంది. ఆ దేశాల్లో వచ్చిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భూకంప శిథిలాలను తొలగించే కొద్ది వెలుగుచూస్తున్న విగతజీవులు.. సాయం కోసం ఎదురుచూస్తూ శిథిలాల కింద వేచి చూస్తూ ప్రాణాలుగ్గబట్టుకున్న దయనీయ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి.
Turkey Earthquake: టర్కీ దక్షిణ ప్రాంతంలో వచ్చిన భారీ భూకంపం ధాటికి టర్కీ, సిరియా దేశాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతలో ఆ తరువాత 7.5, 6 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. టర్కీ, సిరియా ప్రాంతాలు ఈ భూకంపాల ధాటికి తీవ్రగా దెబ్బతిన్నాయి.