ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సత్తుపల్లిలో సన్నహక సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రం లో రాజకీయ పరిస్థితులు అరచేతిలో కనపడుతున్నాయన్నారు. ఏ సమస్య కోసం ప్రత్యేక రాష్ట్రం కోరుకున్న ప్రజలు అతి కొద్ది రోజుల్లోనే 24 గంటల విద్యుత్ సరఫరా చేసి తీర్చిదిద్దుకున్నామన్నారు. భారత దేశంలో ప్రతి ఇంటికి నళ్ల ద్వారా మంచి నీళ్లు ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వదని, తెలంగాణ రాకముందు కరెంట్, మంచీనీళ్ళు, సాగునీరు సమస్య ఉండేది తెలంగాణ వచ్చాక అన్ని సమస్యలు పోయాయన్నారు.
Also Read : Varanasi Tent City: వారణాసిలో టెంట్ సిటీ.. ప్రారంభించిన ప్రధాని మోడీ
తెలంగాణ ప్రజల సమస్యలను తీర్చిన ప్రభుత్వం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వమన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రం లో అమలు కానీ పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని, మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టి పార్టీలను కాకుండా ప్రజలకోసం బీఆర్‌ఎస్ పార్టీ నెలకొల్పారన్నారు. కేసీఆర్ తలంపు తలా పెట్టారో భారతదేశ అభివృద్ధికే బీఆర్ఎస్ పార్టీ స్థాపించారన్నారు. తెలంగాణ అమలు అవుతున్న పథకాలు భారతదేశం వ్యాప్తంగా అమలు చేసి భారతదేశం రోల్ మోడల్ గా చేయాటానికి కేసిఆర్ కి మనందరం సహాకారం అందించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అవిర్బవ సభ మన జిల్లాలో పెట్టాటం మన అదృష్టమని, జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ సభ చరిత్రలో నిలవాలన్నారు.
Also Read : LIC Aadhaar Shila scheme : రూ.58పెట్టుబడి పెడితే రూ.8లక్షలు మీ సొంతం