LIC Aadhaar Shila scheme : దేశంలోని అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీ.. ఎల్ఐసీ మహిళలకు ఓ శుభవార్త తీసుకొచ్చింది. ఎల్ఐసీ ఆధార్ షీలా స్కీంలో రోజుకు రూ.58పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో దాదాపు రూ.7.9లక్షలను సొంతం చేసుకోవచ్చు. ఈ పాలసీ కింద 8 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వయసున్న మహిళలు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. పాలసీదారు మరణించిన తర్వాత కూడా ఈ పథకం కింద మొత్తం డబ్బు నామినీకి ఇవ్వబడుతుంది.
నేటికీ ఎల్ఐసీ అనేది ఒక నమ్మకమైన కంపెనీగా పేర్గాంచింది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు నేటికీ ఎల్‌ఐసి, పోస్టాఫీసులో డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతున్నారు. LIC కూడా కొత్త కొత్త ప్లాన్లను తెస్తూ తన కస్టమర్లను ఎప్పుడూ నిరాశపరచదు. తాజాగా LIC ఆధార్ శిలా ప్లాన్ ను తీసుకొచ్చింది. అలాగే, మెచ్యూరిటీ సమయంలో వెంటనే వారి డబ్బును తిరిగి చెల్లిస్తుంది కంపెనీ.
Read Also: Infosys : అంచనాలను మించిన ఇన్ఫోసిస్ ఆదాయం
ఆధార్ పాలసీ ప్రత్యేకత
* LIC ఆధార్ శిలా యోజన మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది.
* కనీస పాలసీ వ్యవధి 10 సంవత్సరాలు.. గరిష్టంగా 20 సంవత్సరాలు.
* ఈ ప్లాన్ మెచ్యూరిటీ గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు.
* పాలసీ తీసుకున్న 5 సంవత్సరాల తర్వాత పాలసీదారు మరణిస్తే, ఈ పరిస్థితిలో మెచ్యూరిటీపై లాయల్టీ అడిషన్ సౌకర్యం పొందుతుంది.
* పాలసీ వ్యవధి ముగిసే సమయానికి ఒకేసారి మొత్తం కూడా అందుకుంటారు.
* పథకం కింద కనీసం రూ.75వేలు.. గరిష్టంగా రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు.
* నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన ఈ ప్లాన్‌ను ప్రీమియం చెల్లించే అవకాశం ఉంది.
Read Also: Income Tax : మీరు ఇలా చేస్తే ఇన్ కం టాక్స్ రూపాయి కట్టనక్కర్లేదు
30 సంవత్సరాల వయస్సులో, మీరు ఈ పథకంలో వరుసగా 20 సంవత్సరాల పాటు ప్రతిరోజూ రూ. 58 డిపాజిట్ చేశారనుకోండి, అప్పుడు మీ మొదటి సంవత్సరంలో మొత్తం రూ. 21918 డిపాజిట్ చేయబడుతుంది. దానిపై మీరు కూడా 4.5 శాతం పన్ను చెల్లించాలి. ఆ తర్వాత రెండో సంవత్సరంలో మీరు రూ. 21446 చెల్లించాలి. ఈ విధంగా, మీరు ఈ ప్రీమియాన్ని నెలవారీ, త్రైమాసికం, అర్ధ సంవత్సరం లేదా వార్షిక ప్రాతిపదికన జమ చేస్తారు. మీరు ప్రతి సంవత్సరం ప్రీమియం చెల్లిస్తే 20 సంవత్సరాలకు రూ. 429392 డిపాజిట్ చేస్తారు. దీని తర్వాత, మెచ్యూరిటీ సమయంలో, మీరు మొత్తం రూ. 794000 పొందుతారు.
ఆధార్ శిలా పాలసీని తీసుకోవడానికి కావాల్సినవి: గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఓటరు కార్డు , పాస్‌పోర్ట్ చిరునామా – ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు, రేషన్ కార్డు, ఓటరు కార్డు /లేదా పాస్‌పోర్ట్ ఆదాయపు పన్ను రిటర్నులు లేదా పే స్లిప్‌లు లతో పాటు.. హెల్త్ సర్టిఫికెట్ లను అందించాల్సి ఉంటుంది.