Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Copper Utensils Cleaning Tips: భారతీయ ఇళ్లలో రాగి, ఇత్తడి పాత్రలకు ప్రత్యేక స్థానం ఉంది. పూజా సామగ్రి నుంచి నీటి గ్లాసులు, వంట పాత్రల వరకు ఈ లోహాలతో తయారైన వస్తువులు ఇప్పటికీ అనేక ఇళ్లలో ఉపయోగిస్తున్నారు. అయితే కాలక్రమేణా ఇవి గాలిలోని తేమ, దుమ్ము కారణంగా నల్లగా లేదా మసకబారినట్లు కనిపించడం ప్రారంభిస్తాయి. దీంతో చాలా మంది మార్కెట్లో లభించే ఖరీదైన క్లీనర్లను కొనుగోలు చేస్తుంటారు. కానీ మీ వంటగదిలోనే ఉండే కొన్ని పదార్థాలతో ఈ పాత్రలను మళ్లీ కొత్తవాటిలా మెరిపించవచ్చు.
ఈ సులభమైన చిట్కా కోసం మీకు పిండి, పసుపు, ఉప్పు, నిమ్మరసం మాత్రమే అవసరం. ముందుగా ఒక చిన్న గిన్నెలో అవసరమైనంత పిండి తీసుకుని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు కలపాలి. అనంతరం నిమ్మరసం వేసి మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఇక, తయారైన పేస్ట్‌ను రాగి లేదా ఇత్తడి పాత్ర మొత్తం ఉపరితలంపై సమానంగా పూయాలి. ముఖ్యంగా నల్లటి మరకలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొంచెం ఎక్కువగా పూయడం మంచిది. అనంతరం ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఈ సమయంలో నిమ్మరసంలోని సహజ ఆమ్లం, ఉప్పు కలిసి పేరుకుపోయిన మురికిని తొలగించడంలో సహాయపడతాయి.
Also Read
- Protein Rich Foods: ఒంట్లో బలం అమాంతం పెంచే హై ప్రోటీన్ రొట్టె.. చాలా సింపుల్ ఇలా చేసుకోండి!
- Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!
- Easy Lunch Recipes: రోజూ అవే చారులా? మజ్జిగతో ఇలా చేసి చూడండి, ప్లేట్ ఖాళీ కావాల్సిందే!
- Kitchen Cleaning Tips: వంటగది చెత్తబుట్ట నుంచి దుర్వాసన వస్తోందా? ఈ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి!
తర్వాత పాత్రలను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. అవసరమైతే మెత్తని గుడ్డ లేదా చేతులతో మెల్లగా రుద్దుతూ పేస్ట్‌ను తొలగించాలి. కడిగిన వెంటనే శుభ్రమైన, పొడి గుడ్డతో పూర్తిగా తుడవాలి. పాత్రలపై నీటి చుక్కలు మిగిలితే అవి ఆరిన తర్వాత మళ్లీ మరకలుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం. ఈ పద్ధతిలో ఉపయోగించే పదార్థాలన్నీ దాదాపు ప్రతి ఇంటి వంటగదిలోనే సులభంగా లభిస్తాయి. ఎలాంటి ఖరీదైన క్లీనర్లు కొనాల్సిన అవసరం లేకుండా, తక్కువ ఖర్చుతోనే రాగి, ఇత్తడి పాత్రలకు పాత మెరుపును తిరిగి తీసుకురావచ్చు. తదుపరిసారి మీ పాత్రలు మసకబారినట్లు కనిపిస్తే, ఈ సులభమైన ఇంటి చిట్కాను ఒకసారి తప్పకుండా ప్రయత్నించండి.
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!