No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేసింది. రవాణా వ్యవస్థలో ఇది అత్యంత విచారకరమైన విషయమని ధర్మాసనం పేర్కొంది. దేశంలోని మొత్తం 30.48 కోట్ల నమోదిత వాహనాల్లో దాదాపు 56 శాతం ఎలాంటి థర్డ్ పార్టీ బీమా లేకుండానే నిర్లక్ష్యంగా తిరుగుతున్నాయని సంచలన గణాంకాలను వెల్లడించింది. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు లేదా వారి కుటుంబాలకు సకాలంలో పరిహారం అందకుండా పోతోందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా లభించే జీవించే ప్రాథమిక హక్కును భంగపరచడమేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఈ తీవ్రమైన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల ధర్మాసనం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. బీమా లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ నిలిపివేసే ‘నో ఇన్సూరెన్స్, నో ఫ్యూయల్’ పైలట్ ప్రాజెక్ట్‌ను పరిశీలించాలని MoRTH, IRDAI లతో పాటు పెట్రోలియం మంత్రిత్వ శాఖను ఆదేశించింది.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
నిబంధనలు ఉల్లంఘించే వాహనాలను గుర్తించేందుకు రోడ్లపై ఉన్న ANPR కెమెరాలను ‘విహాన్’ (VAHAN) డేటాబేస్‌తో అనుసంధానించి, నేరుగా ఈ-చలాన్లు జారీ చేయాలని తెలిపింది. ట్రాఫిక్ పోలీసులకు తక్షణ తనిఖీల కోసం డిజిటల్ పరికరాలను అందించాలని సూచించింది. నూతన ప్రైవేట్ కార్లకు నిర్బంధ థర్డ్-పార్టీ బీమా కాలాన్ని 3 నుంచి 4 ఏళ్లకు, ద్విచక్ర వాహనాలకు 5 నుంచి 6 ఏళ్లకు పెంచాలని ఐఆర్‌డీఏఐని ఆదేశించింది. వాహన బీమాను సులభతరం చేసేందుకు ‘నాలుగు అంచెల’ పాలసీ విధానాన్ని ప్రతిపాదించింది. పౌరులు కూడా వాహనాల బీమా వివరాలను తనిఖీ చేసి నివేదించే వెసులుబాటు కల్పించాలని తెలిపింది.
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!