పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పొంగులేటి వర్గియుడు తుళ్లూరు బ్రహ్మయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2023లో బీఆర్ఎస్‌కు, ఇంకా మీకు చేదుగా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు 5 ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎమ్మెల్సీ తాత మధు మంత్రి శ్రీనివాస రెడ్డిని ఉద్దేశించి అనేక ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. వాటిని శ్రీనన్న అనుచరులుగా మేము ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిని మేము మీకు బైలాస్ లు ఉన్నాయా అని అడుగుతున్నామని, అసలు మీ పార్టీలో అధ్యక్షుడు తప్ప ఎవరూ లేరన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డికి చప్రాసి గిరి ఫలితమే మీకు ఎమ్మెల్సీ పదవి అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Bitra Sivannarayana : సోము వీర్రాజును విమర్శించే అర్హత వాళ్ళకు లేదు
మా నాయకుణ్ణి ఏక వచనంతో సంబోధించడం పద్దతి కాదని, మా నాయకుడు వృత్తి రీత్యా కాంట్రాక్టర్.. టెండర్ వేయడం తప్ప అని ఆయన ప్రశ్నించారు. ఇంకా ఎన్ని సంవత్సరాలకు గోదావరి నీళ్లతో కాళ్లు కడుగుతారు.. ధరణి అనేది కేవలం హైదరాబాదులో ఉన్న భూములను కబ్జా చేయడానికి.. సెటిల్మెంట్ చేయడానికి వచ్చిందని ఆయన అన్నారు. మిమ్మలను మీ నాయకుణ్ణి 2018లో జరిగిన ఎన్నికల్లో తిట్టిన ఎమ్మెల్యేలు మీ పార్టీ లో చేరారని, 2023 జరిగే ఎన్నికల్లో మీకు అప్పుడు వచ్చిన ఆ ఒక్క సీటు కూడా గెలవలేరన్నారు. రెండు వేల కోట్లు మాకు ఇవ్వండి.. మా నాయకుడు ఆస్తి అంతా మీకు రాసిస్తామన్నారు. ప్రగతి భవన్ కి కేసీఆర్‌కు పల్లా రాజేశ్వర్ రెడ్డి కి చేసిన చప్రాసి గిరి వల్ల మీరు గెలిచారు అని ఆయన అన్నారు. మేము ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్దమని ఆయన సవాల్ విసిరారు.
Also Read : INDvsAUS 2nd Test: రాహుల్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన ఖవాజా!