బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టు హోరాహోరీగా సాగుతోంది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 263 రన్స్‌కు ఆలౌటైంది. భారత బౌలర్లు మరోసారి ఈ మ్యాచ్‌లో సత్తా చాటారు. ముఖ్యంగా పేసర్ మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ ఓపెనర్ ఖవాజా ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లను చాలా ఇబ్బంది పెట్టాడు. 81 రన్స్ చేసి సెంచరీవైపు దూసుకెళ్తున్న ఇతడిని జడేజా బుట్టలో వేసుకున్నాడు. ఖవాజా కొట్టిన రివర్స్ స్వీప్ షాట్‌తో బంతి గాలిలోకి ఎగిరింది. అయితే షార్ట్ మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ జంప్ చేసి ఒంటి చేతితో క్యాచ్ పట్టేశాడు. గాల్లోకి ఎగిరి బంతిని ఒడిసిపట్టిన తీరు ఫ్యాన్స్‌ను తెగ ఆకర్షించింది. దీంతో వెంటనే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: Parasites Eat Eye: కాంటాక్ట్ లెన్స్ తో నిద్రపోయాడు.. లేచే సరికి కన్ను పోయింది..
మరో క్యాచ్‌తో..
ఆసీస్ మరో బ్యాటర్ ట్రెవిస్ హెడ్ వికెట్ తీసిన విధానం కూడా నెట్టింట వైరల్ అయింది. షమీ వేసిన బంతి ఎడ్జ్ తీసుకొని స్లిప్స్ వైపు దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ చాలా చురుగ్గా స్పందించి ఆ క్యాచ్ పట్టేశాడు. హెడ్ ఔటైన విధానం చూసిన అభిమానులు షమీ బౌలింగ్‌తోపాటు రాహుల్ స్పందించిన తీరును కూడా మెచ్చుకుంటున్నారు. ఇంత స్టన్నింగ్ క్యాచ్ పట్టుకున్నందుకు శభాష్ అంటున్నారు. స్లిప్స్‌లో క్యాచ్‌లు పట్టడం ఎప్పుడూ అంత సులభం కాదు. బంతి చాలా వేగంగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. లేదంటే క్యాచ్ నేలపాలు కావడం ఖాయం. ఈ క్రమంలోనే రాహుల్ కింద పడిపోతూ చటుక్కున క్యాచ్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అభిమానులు అతని ఫీల్డింగ్‌ను మెచ్చుకుంటున్నారు.
ICYMI – WHAT. A. CATCH 😯😯
WOW. A one-handed stunner from @klrahul to end Usman Khawaja’s enterprising stay!#INDvAUS pic.twitter.com/ODnHQ2BPIK
— BCCI (@BCCI) February 17, 2023
Also Read: IPL 2023: ఈసారి హైదరాబాద్‌లో 7 లీగ్ మ్యాచ్‌లు.. వివరాలు ఇవే!