శ్రీవాణి ట్రస్ట్ కి భక్తులు నుంచి స్పందన పెరిగే కొద్ది టీటీడీకి కష్టాలు పెరుగుతున్నాయి.మొదట్లో శ్రీవాణి దర్శన టికెట్లను ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే కేటాయించేది టీటీడీ.తిరుమల లోని అడిషనల్ ఈవో కార్యాలయంలోనే టికెట్ల కౌంటర్ ను ఏర్పాటు చేసింది టీటీడీ.విఐపి బ్రేక్ దర్శనానికి సంబంధించి సిఫార్సు లేఖలు పై జారీ చేసే కార్యాలయం కూడా ఇదే కావడంతో ...అలా టికెట్లు పొందలేని భక్తులు శ్రీవాణి టిక్కెట్లు పొందే వెసులుబాటు లభిస్తుందని భావిస్తున్నారు..
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పిస్తోంది టీటీడీ.. ఈ ప్రయోగం ఇవాళ్టి నుంచి అమలుకానుంది. శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనుంది.
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తలకు అలర్ట్.. శ్రీవాణి దర్శన సమయాల్లో మార్పులు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). టికెట్ తీసుకున్న రోజే దర్శనం కల్పిస్తోంది. ఈ ప్రయోగం రేపటి నుంచి అమలుకానుంది. శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులను సాయంత్రం నాలుగున్నర గంటలకు దర్శనానికి అనుమతించనుంది.