ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్ విభాగ నెట్‌వర్క్‌ను మరింతగా విస్తరిస్తున్నామని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. వినియోగదారులకు వేగవంతమైన సేవలందించేందుకు త్వరలోనే పార్శిళ్లను ఇంటి వద్దనే పికప్, డెలివరీ చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ మోడల్ కౌంటర్‌ను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ ప్రారంభించారు. కొత్త కౌంటర్‌లో ఒక పార్శిల్‌ను బుకింగ్ చేసి రశీదును వినియోగదారుడికి ఆయన అందజేశారు.…
ప్రస్తుతం చాలా మంది ఆన్‌లైన్‌లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ద్వారా పలు వస్తువులను ఆర్డర్ చేస్తుంటారు. ఈ-కామర్స్ సైట్‌లో బుక్ చేసే ఆర్డర్ మీకు ఎలా డెలివరీ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే చాలా మంది బుక్ చేసే పార్శిళ్లలో వస్తువులు డ్యామేజ్ అయితే డెలివరీ బాయ్స్ కారణమని నిందిస్తుంటారు. కానీ ఆ పార్శిళ్లు ఎక్కడి నుంచి రవాణా అయ్యాయి.. ఎలా రవాణా అయ్యాయన్న విషయాన్ని మాత్రం పట్టించుకోరు. ఈ నేపథ్యంలో పార్శిల్ భద్రత గురించి డెలివరీ…