Varalaxmi Sarathkumar: పిచ్చి పిచ్చి రాతలు రాస్తే.. పరువు నష్టం దావా వేస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varalaxmi Sarathkumar: కోలీవుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది వరలక్ష్మీ శరత్ కుమార్. హీరోయిన్ గా ఛాన్స్ లు వచ్చినా అవి సెట్ అవ్వకపోయేసరికి అమ్మడు విలనిజం మీద పడింది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ చిన్నది ఇప్పుడు బక్కచిక్కి స్టార్ హీరోలకు ధీటుగా విలనిజాన్ని పండిస్తూ వరుస ఆఫర్స్ ను అందుకుంటుంది. తెలుగు, తమిళ్ లో ప్రస్తుతం మంచి సినిమాలు చేస్తున్న వరూ .. ఈ మధ్యనే ఆర్ట్ గ్యాలరీల నిర్వాహకుడు నికోలై సచ్‌దేవ్ తో నిశ్చితార్థం చేసుకుంది. ఇక అంతా హ్యాపీగానే ఉన్నా.. అమ్మడిని ఆ డ్రగ్స్ కేసు మాత్రం వదలడం లేదు. గతంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో వరలక్ష్మీ శరత్‌కుమార్ మాజీ అసిస్టెంట్ ఆదిలింగం అరెస్టయ్యాడు. అతనికి డ్రగ్స్, ఆయుధాల సరఫరాలో అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికర్లతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదిలింగం సినీ పరిశ్రమలో పెట్టుబడిగా పెడుతున్నారని గుర్తించారు. అందుకే ఆదిలింగం గతంలో పీఏగా పనిచేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను కూడా విచారించాలని ఎన్‌ఐఏ నిర్ణయించింది. ఈ విచారణకు వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు కూడా సమన్లు అందాయని, ఎన్‌ఐఏ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని ఆమె కోరినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక సమయం ముగిసినా ఆమె విచారణకు హాజరుకాకపోవడంతో ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేసాయి. ఇక ఈ విషయమై వరలక్ష్మీ సీరియస్ అయ్యింది. ఇదేనా రియల్ జర్నలిజం అంటూ మీడియాపై ఫైర్ అయ్యింది.
తన సోషల్ మీడియా వేదికగా ఆమె ఈ విధంగా రాసుకొచ్చింది. ” మన ప్రతిభావంతులైన మీడియాకు పాత నకిలీ వార్తలను ప్రసారం చేయడం కంటే వార్తలు లేకపోవడం చాలా విచారకరం. మా ప్రియమైన జర్నలిస్టులు ప్రత్యేకించి తమకు తాము అనుకోని రాసే వార్తల సైట్‌లు మీరెందుకు రియల్ జర్నలిజం చేయకుడు. మా ప్రముఖులలో లోపాలను కనుగొనడం మానేయండి. మేము నటించడానికి, ప్రజలను అలరించడానికి మరియు మా పనులు చేయడానికి ప్రయత్నిస్తున్నాము..మీరు మీ పనిని ఎందుకు చేయకూడదు? దేశంలో 1000 తీవ్రమైన సమస్యలు ఉన్నాయి.. వాటిపై మీరు శ్రద్ద పెట్టండి. మా మౌనాన్ని బలహీనతగా భావించవద్దు. పరువు నష్టం కేసులు కూడా ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి.. ఫేక్ ట్రాష్ నిరాధార వార్తలను ప్రసారం చేయడం ఆపండి. ప్రజలు గర్వపడే వార్తలను రాసి రియల్ జర్నలిజం చేయండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి - మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
- Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
- Johnny Master - Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
It’s so sad that our talented media has no news than to start circulating old #fakenews. Our dear journalists especially the self proclaimed news sites and your articles, why don’t you actually start doing some real journalism! Stop finding flaws with your celebtrities, we are…
— 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) March 14, 2024
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..