Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది.. అయితే, కీలక నేతలైన సీఎం వైఎస్ జగన్ పులివెందుల నుంచి, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి అనేది ఎప్పుడో ఫైనల్ అయినా.. ఈ సారి జనసేనాని పవన్ కల్యాణ్ ఏ స్థానం నుంచి బరిలోకి దిగుతారు? అనే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన ఆయన.. రెండు స్థానాల్లోనూ ఓటమిపాలయ్యారు. అయితే, ఈ సారి పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? మరోసారి భీమవరం నుంచి పోటీ చేస్తారా..? ఈ సారి పిఠాపురంపై గురిపెట్టారా? అనే ప్రచారం జరుగుతూ వచ్చింది.. అనే ఉత్కంఠకు జనసేన పార్టీ తెరదించింది.. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుండి పవన్ కల్యాణ్ పోటీ చేయడం ఖరారు అయ్యింది.. జనసేన సోషల్ మీడియా సమావేశంలో అధికారికంగా పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో.. పవన్ కల్యాణ్ అసెంబ్లీ స్థానంపై క్లారిటీ వచ్చినట్టు అయ్యింది. కాగా, గతంలో కమ్యూనిస్టులతో కలిసి పవన్ కల్యాణ్ ఎన్నికలకు వెళ్లారు.. కానీ, ఈ సారి టీడీపీ, బీజేపీ పొత్తులో ఎన్నికలకు వెళ్తున్న విషయం విదితమే. ఈ సారి అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించితీరుతామని నమ్మకంగా చెబుతున్నారు మిత్రపక్షాల నేతలు.
Read Also: World Kidney Day 2024: పిల్లలలో పెరుగుతున్న కిడ్నీ వ్యాధులు.. ఈ సంకేతాల ద్వారా గుర్తించవచ్చు!