తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్ స్టేషన్‌లో మేడారం స్పెషల్ బస్సులను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకుంటున్న పలు కీలక నిర్ణయాలను ఆయన వెల్లడించారు. జాతరకు వెళ్లే భక్తులకు ఎక్కడా రవాణా ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4000 ఆర్టీసీ బస్సులను…
సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణికుల సందడి మళ్ళీ మొదలైంది. తమ స్వగ్రామాలకు వెళ్లిన వారంతా తిరిగి హైదరాబాద్‌కు పయనం కావడంతో నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారులపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా చిట్యాల సమీపంలోని జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఒకేసారి రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ప్రయాణికులు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.…
ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ అందించింది. దసరాకు లక్కీ డ్రా నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ప్రయాణికులు ఆర్టీసీ బస్సెక్కితే బహుమతులు అందించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో రీజియన్‌కి ముగ్గురు చొప్పున 33 మందికి రూ.5.50 లక్షల విలువగల బహుమతులను సంస్థ అందజేయనుంది. ఒక్కో రీజియన్‌కు ప్రథమ బహుమతి రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలను సంస్థ ప్రకటించింది. Also Read:Telangana : తెలంగాణలో దసరా షాపింగ్ బీభత్స…
CM Revanth Reddy : బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిన్న వరంగల్ ఎల్కతుర్తిలో బీఆర్‌ఎస్ రజతోత్సవ భారీ సభ నిర్వహించారు. ఈ సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సందర్భంగా మావోయిస్టుల అంశంపై జానారెడ్డితో చర్చ జరిగినట్లు చెప్పారు. గతంలో మావోయిస్టులతో చర్చలు…
KTR : 2025 సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి కీలకమని పేర్కొన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ ఎల్కతుర్తిలో నిర్వహించనున్న రజతోత్సవ సభకు ఇప్పటివరకు పోలీసులు అనుమతులు ఇవ్వలేదని ఆరోపించారు. మార్చి 28న అనుమతికి అప్లై చేసినప్పటికీ ఇంకా ప్రతిస్పందన లేదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతీకగా బీఆర్ఎస్ పార్టీ నిలిచిందని, రాష్ట్రం రూపుదిద్దుకునే దశలో పుట్టిన ఈ పార్టీ ఇప్పటికి అరవై లక్షల సభ్యులను కలిగి ఉందన్నారు. “రజతోత్సవం ప్రభుత్వానికి విరుద్ధంగా నిర్వహించే సభ కాదు,…
Heavy Rush: తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండగ సందడి మొదలైంది. ప్రయాణికుల రద్దీతో రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు నిండిపోయాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పండగ నేపథ్యంలో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డీజిల్ రెట్లు తగ్గినా కూడా బస్సు చార్జీలు పెంచిన ఘనత జగన్ ది అని ఆరోపించారు. జగన్ మాటలు ప్రజలు వినే పరిస్థితి లేదని అన్నారు. మరోవైపు.. శాఖల్లో ఏదైనా అవినీతి జరిగి ఉంటే, తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా.. ఏ రాజకీయ సభలకు ఫ్రీగా బస్సులు ఉపయోగించమని అన్నారు.
TSRTC National Award: టీఎస్ఆర్టీసీకి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్