ఉస్మానియా యూనివర్శిటీ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఎస్ సెట్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మూడేళ్ల విరామం తర్వాత 2023 మార్చి నెలలో నిర్వహించబడనుంది. డిగ్రీ మరియు యూనివర్శిటీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు/లెక్చరర్లుగా అర్హతను తనిఖీ చేయడానికి పరీక్ష విధానంలో రెండు పేపర్లు చేర్చినట్లు ఉస్మానియా యూనివర్శిటీ పేర్కొంది. పేపర్-I మొత్తం 100 మార్కులతో 50 ప్రశ్నలను కలిగి ఉంటుంది. పేపర్-II 100 ప్రశ్నలతో 200 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు మూడు గంటల పరీక్ష వ్యవధి ఉంటుంది. డిసెంబరు 30 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. చివరిసారిగా 2019లో సెట్ నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే.
Also Read : IPL Auction 2023 Live Updates: పీయూష్ చావ్లాను కొనుగోలు చేసిన ముంబై
కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలు సెట్ నిర్వహించలేదు. తాజాగా టీఎస్‌సెట్-2022 షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి.. నేటి నుంచి (డిసెంబర్ 23) ప్రారంభం కావాల్సిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ వాయిదా పడింది. డిసెంబరు 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు TSPSC ప్రకటించింది. సాంకేతిక కారణాలతో దరఖాస్తుల ప్రక్రియ వాయిదా వేసినట్లు వెల్లడించింది. మొత్తం 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో 9,168 పోస్టులకు ఇప్పటికే టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే.
Also Read : Kamal Haasan: భారత్ జోడో యాత్ర.. రేపు రాహుల్ గాంధీతో పాల్గొననున్న కమల్ హాసన్..